Telugu

మరణాన్ని జయించి అనుకున్న లక్ష్యం వైపు దూసుకెళ్తున్న పంత్…!

2016 లో జరిగిన ఐపిల్ లో ఢిల్లీ ఫ్రాంఛైజ్స్ తరుపున మొదటిసారిగా క్రికెట్ అభిమానులను పలకరించిన రిషబ్ పంత్ అందరి దృష్టిని తన వైపుకి తిప్పుకున్నారు. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మన్ గా క్రికెట్ గ్రౌండ్ లో అడుగుపెట్టిన అతికొద్దికాలంలోనే 2017 లో జరిగిన టీ 20 ఇంటర్ నేషనల్ మ్యాచ్ లలో సెలక్ట్ అయ్యాడు.

ధోనిని మరిపించగలిగిన మరో ధోని వచ్చాడు అనేలా పంత్ తన ఆట శైలితో క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నారు. 2019 లో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లకు సెలెక్ట్ అయిన రిషబ్ 2020 నుంచి స్టార్ బ్యాట్స్ మాన్ గా ఎదిగారు. ఇక 2021 లో ఆస్ట్రేలియా గబ్బా స్టేడియం లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో రిషబ్ కనపరిచిన ఆట తీరుతో ఆ సిరీస్ లో భారత్ ఘన విజయం సాధించింది.

ADVERTISEMENT

సీనియర్ ప్లేయర్స్ లేకుండా ఆస్ట్రేలియా మీద విజయం సాధించడంతో రిషబ్ పేరు మారుమోగింది. ఇలా తన క్రీడా జీవితాన్ని అంచలంచెలుగా పెంచుకుంటున్న రిషబ్ జీవితంలో అనుకోని చేదు అనుభవం ఎదురయ్యింది. 2022 డిసెంబర్ 30 న కారు ప్రమాదంలో చిక్కుకుని చావు అంచులదాకా వెళ్లివచ్చారు రిషబ్. అప్పటి నుంచి క్రికెట్ కు గ్రౌండ్ కు దూరంగా ఉంటున్న పంత్ మళ్ళీ క్రికెటర్ గా గ్రౌండ్ లోకి అడుగు పెట్టాలనే గట్టి పట్టుదలతో తన ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టి అనుకున్న లక్ష్యాన్ని మరోసారి చేరుకున్నారు.

ఎంగెస్ట్ ఇండియన్ టి 20 క్రికెటర్ గా వచ్చిన రిషబ్ పంత్ పట్టుదలకు, ఆశయానికి ఫిదా అయిన బీసీసీఐ ఆయన మీద ఒక స్పెషల్ స్టోరీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘ది గ్రేట్ కమ్ బ్యాక్ స్టోరీ….మిరకిల్ మాన్ పార్ట్ -1 ‘ పేరిట ఒక వీడియో ను విడుదల చేసింది బీసీసీఐ. 2024 ఐపిల్ కి ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున టీం కెప్టెన్ గా బాధ్యతలు తీసుకుంటూ 2022 లో దూరమైన క్రికెట్ గ్రౌండ్ లోకి మరోసారి అడుగుపెట్టనున్నారు రిషబ్ పంత్.

పట్టుదల, ఏకాగ్రత, సంకల్ప బలంతో మరణాన్ని జయించి అనుకున్న లక్ష్యం వైపు దూసుకొస్తున్న రిషబ్ జీవితం యువతకు ఒక మంచి ప్రేరణ కల్పించేలా ఉంది. కారు ప్రమాదంతో చావు అంచులదాకా వెళ్లినా కూడా తిరిగి క్రికెట్ ఆడాలనే అనే ఆశయంతో ఓటమిని ఒప్పుకోక అలుపెరుగని పోరాటం చేసారు పంత్.

తమ జీవితంలో అనుకున్న సంఘటనలు జరగలేదనో, అనుకోని విపత్తులు ఎదురయ్యాయనే భయంతోనో కొంతమంది యువత బలవన్మరణాల వైపు ఆకర్షితులయ్యి బంగారు భవిష్యత్తు ను నాశనం చేసుకుని కన్నవారికి కన్నీళ్లు మిగులుస్తున్నారు. అటువంటి వారికి రిషబ్ జీవితం ఒక ఆదర్శం కానుంది. ఆల్ ది బెస్ట్ టూ రిషబ్ పంత్.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Jailer 2 Review: U.S. Premiere Report

Jailer 2 is the sequel to Nelson’s superhit Jailer. Stay tuned for the Jailer 2…

1 hour ago

AK47 Confusion Turns Double Trouble for Venkatesh?

Aadarsha Kutumbam - AK47 was recently postponed again, and there is still no clarity about…

7 hours ago