
ఈ ప్రాంతంలో సముద్ర గర్భంగా కిలోమీటరు వెడల్పు, దాదాపు 150 అడుగుల లోతైన క్రేటర్స్ (అగ్ని బిలాలు) ఎన్నో ఉన్నాయని గుర్తించారు. వీటి అడుగు భాగం నుంచి పెద్ద ఎత్తున మిథేన్ వెలువడుతోందని, దీనికి ఉన్న మండే స్వభావం కారణంగా భారీ పేలుళ్లు జరుగుతున్నాయని గుర్తించారు. ఒకసారి మిథేన్ మండిపోయిన ప్రాంతంలో ఏర్పడే శూన్యాన్ని పూరించేందుకు సముద్ర జలాలు ఒక్కసారిగా బిలాల్లోకి దుముకుతుండటంతో, ఉపరితలంపై నీటి గుంతలు ఏర్పడి భారీ నౌకలు మునిగి పోతున్నాయని అంచనా వేసినట్లు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. విమానాలు కూలిపోవడానికి కూడా ఇదే కారణం కావచ్చని, తమ శోధనతో బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ దాదాపు వీడినట్టేనని, మరిన్ని సాక్ష్యాల కోసం ఇంకా అధ్యయనం చేయాల్సి వుందని అంటున్నారు.
The Federation of Indian Pilots has raised fresh concerns regarding the cause of the deadly…
Vijay is dominating headlines again, this time for politics, not films. The latest assembly election…