నడిరోడ్డుపై “భలే మంచి రోజు” హీరోయిన్ చిందులు!

శ్రీరామ్ ఆదిత్యా దర్శకత్వంలో సుధీర్ బాబు, గబ్బివామికా జంటగా నటించిన “భలే మంచి రోజు” సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. గత వారం విడుదలైన నాలుగు సినిమాలలో ప్రేక్షకుల చేత ‘పాస్’ మార్కులు వేయించుకున్న సినిమాగా “భలే మంచి రోజు” విమర్శకుల ప్రశంసలు అందుకుంది. డైరెక్టర్ శ్రీరామ్ టాలెంట్ కు నిదర్శనంగా నిలిచిన ఈ సినిమా సక్సెస్ ను హీరోయిన్ గబ్బి వామికా ఎలా ఎంజాయ్ చేసిందో తెలిస్తే అవాక్కవుతారు.

కారు దిగి రోడ్డు పక్కనే ‘తీన్ మార్’ స్టెప్పులేస్తూ సందడి చేసింది గబ్బి. ఈ వీడియోను చిత్రీకరించి హీరో సుధీర్ బాబు ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. “మరో హీరోయిన్ ఇలా ఎంజాయ్ చేస్తుందో లేదో గానీ, ఈ క్రేజీ గర్ల్ మాత్రం ఇలా చేసిందని” పోస్ట్ చేసిన వీడియోకు హీరోయిన్ గబ్బి, తన ఆనందం పీక్స్ లో ఉందని ట్వీట్ చేసింది. మొత్తానికి మొదటి సినిమాతోనే హిట్ కొట్టి, ఇలా నడిరోడ్డుపై చిందులేసి గబ్బి బాగానే పబ్లిసిటీ కొట్టేస్తున్నట్లుంది.

ADVERTISEMENT
Share
Published by

Recent Posts

What To Watch on OTT This Week?

The last few weeks have been rather disappointing for the Indian OTT audience with not…

14 minutes ago

Players Discriminated Against by Selectors? Dhawan Speaks Out

Former India opener Shikhar Dhawan has dismissed claims that players from Jammu and Kashmir face…

44 minutes ago