
ఈ తరుణంలో ‘భరత్ అనే నేను’ ఆల్బమ్ లో ఉన్న ఏకైక డ్యూయెట్ సాంగ్ ‘ఓ వసుమతి’ని యూ ట్యూబ్ లో చిత్ర యూనిట్ విడుదల చేసింది. మహేష్ – కైరా అద్వానీలు జంటగా కనువిందు చేసిన ఈ పాటను ముందుగా టీవీ9 ఛానల్ లో మధ్యాహ్నం వేళలో ప్రత్యేకంగా విడుదల చేయగా, సాయంత్రానికి యూ ట్యూబ్ లో ప్రత్యక్షమైంది.
దీంతో ఈ పాటను వీక్షిస్తూ పండగ చేసుకోవడం ప్రిన్స్ ఫ్యాన్స్ వంతవుతోంది. ఇటీవల కాలంలో సినిమా విడుదలైన ఓ నెల రోజులకే అమెజాన్ ప్రైమ్ ద్వారా మొత్తం సినిమా విడుదల అవుతున్న నేపధ్యంలో… అంతకంటే ముందుగానే వీడియో సాంగ్స్ ను యూ ట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ‘రంగస్థలం’ నుండి నాలుగు పాటలు విడుదలైన విషయం తెలిసిందే.
#AK47 Review: A Safe Family Watch Venky is the film’s biggest strength, with Satya delivering…
Tension in Bigg Boss Telugu Season 10 is rising after the dramatic double elimination of…