Telugu

భావన ప్రశ్నలకు సమాధానాలేవి?

తనపై జరిగిన లైంగిక వేధింపుల ఘటనపై హీరోయిన్ భావన నోరు విప్పింది. ఒక సినిమా హీరోయిన్ ను లొకేషన్ కు తీసుకెళ్లే డ్రైవర్ ఇంతటి దారుణానికి తెగబడతాడా? తెగబడగలడా? అంత ధైర్యం అతనికి ఎవరు? ఎలా? ఎక్కడ? ఎప్పుడు? ఇచ్చారు? అని ప్రశ్నల వర్షం కురిపించింది. ఆ డ్రైవర్ వెనుక ఎవరున్నారు? అన్న దానికి తన వద్ద సమాధానం లేదని, తన శత్రువులే ఈ పని చేయించారా? అంటే వారే అనడం లేదని కూడా తెలిపింది.

కేవలం డబ్బు కోసమే ఇంత పని చేశారా? అంటే జరిగిన ఘటనకు డబ్బుకు ఎక్కడా పొంతన లేకుండా ఉందని భావన తన మదిలో ఉన్న సందేహాలను చెప్పుకొచ్చింది. జరిగిన ఘటనపై తనకు కొన్న అనుమానాలు, ఇంకొన్ని ప్రశ్నలు ఉన్నాయని, వాటికి తనకు సంతృప్తికరమైన సమాధానం కావాలని డిమాండ్ చేసింది. సినిమాల్లో, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అంటుంటారని చెప్పిన భావన, తనకు సినీ పరిశ్రమలో శాశ్వత మిత్రులు, శత్రువులు కూడా ఉన్నారని చెప్పింది.

ADVERTISEMENT

తన శత్రువులకు ఎప్పటికీ తాను క్షమాపణలు చెప్పనని స్పష్టం చేసిన భావన, ఇలా తనకు జరిగినది భవిష్యత్తులో మళ్లీ ఇంకా ఎవరికైనా జరగొచ్చని అభిప్రాయపడింది. ఇవాళ తాను బయటపడి మాట్లాడితేనే, రేపు మరొకరు ధైర్యం చేయగలరని, జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించగలరని తెలిపింది. ఒకవేళ ఇలాంటి ఘటనలు ఎవరికైనా జరిగితే దాచుకోకుండా మాట్లాడాలని సూచనలు చేసింది. నేరస్తులు తప్పించుకునే అవకాశం ఎవరికైనా ఎందుకు ఇవ్వాలి? అని అడిగింది.

తనకు జరిగిన అన్యాయాన్ని దాచి ఉంటే అది కేవలం 10 మందికి మాత్రమే తెలిసి ఉండేదని, అయితే అలా దాయడం వల్ల ఇంత ధైర్యంగా తలెత్తి మాట్లాడే అవకాశం ఉండేది కాదని స్పష్టం చేసింది. అంతే కాకుండా ఏదో తప్పు చేశానన్న భావనతో రాత్రుల్లో నిద్రలేకుండా పట్టి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేసింది. జరిగిన దానిపై పోరాడుతున్నాను కనుకే తను ధైర్యంగా నిద్రపోగలుగుతున్నానని భావన చెప్పింది. ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలో తనకు పక్కా ప్రణాళిక ఉందని భావన తెలిపింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Kamal Haasan, RKFI, SU Arun Promise a Huge Action Feast

Kamal Haasan is a renowned legend of Indian Cinema and he has been choosing young…

1 minute ago

Why Kayadu Lohar Called Herself a “Potato”

Kayadu Lohar has explained why she wrote “I look like a potato” after sharing her…

33 minutes ago