Telugu

2016లోనే భావనకు స్కెచ్ రెడీ!

మలయాళ ముద్దుగుమ్మ భావన లైంగిక వేధింపుల కేసు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ఫిబ్రవరి 17న సినిమా షూటింగ్ ముగించుకుని తన కారులో ఇంటికి వెళ్తున్న హీరోయిన్ భావనను కొందరు అడ్డగించి ఆమె వాహనంలోకి ఎక్కి, సుమారు రెండు గంటల పాటు లైంగికంగా వేధించడమే కాకుండా, అశ్లీల ఫోటోలు చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్‌ సుని అనే వ్యక్తిని, భావన వాహనం డ్రైవర్‌ మార్టిన్ సహా మొత్తం ఆరుగురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.

ADVERTISEMENT

అయితే ఈ కేసు వెనుక పలువురు సినీ పెద్దల హస్తముందని గతంలోనే కథనాలు వెలువడగా, రెండు వారాల క్రితం నటుడు దిలీప్‌ ను పోలీసులు విచారించారు. చివరకు ఆయన ప్రమేయంపై ఆధారాలు లభించడంతో సోమవారం నాడు అరెస్ట్ చేశారు. వాస్తవానికి భావన లైంగిక వేధింపుల ఘటనకు దిలీప్ వివాహం నాడే స్కెచ్ రెడీ అయిందని పోలీసులు గుర్తించారు. 24 నవంబర్ 2016లో దిలీప్, హీరోయిన్ కావ్య మాధవన్ ల వివాహం జరుగగా, ఆ వివాహాన్ని భావన తీవ్రంగా వ్యతిరేకించింది.

ఈ వేడుకకు భావన హాజరు కాలేదు సరికదా, తీవ్ర వ్యాఖ్యలు చేసిందని వార్తలు వెలువడడంతో నొచ్చుకున్న దంపతులు భావనపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వెంటనే ప్రతీకారం తీర్చుకుంటే తామే చేశామన్న విషయం తెలిసిపోతుందని సుదీర్ఘ కాలం వెయిట్ చేశారు. ఒక కార్పొరేటర్ ను కిరాయికి మాట్లాడుకుని పల్సర్ సునీతో కథ నడిపించారని పోలీసులు గుర్తించారు. దిలీప్ ను విచారించిన మీదట, అతని కార్యాలయంలో దాడులు నిర్వహించి, అతని హస్తముందని నిర్థారించుకుని అదుపులోకి తీసుకున్నారు.

ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులే ఇలా కుసంస్కారంగా ప్రవర్తించడంపై సామాన్య ప్రేక్షకులు అవాక్కవుతున్నారు. అందులోనూ దిలీప్ ను వివాహం చేసుకున్న కావ్య మాధవన్ కూడా ఓ హీరోయిన్ కావడం, ఆమె కూడా దిలీప్ వెనుక ఉండడం అనేది ఊహించని విషయం. ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు లేకుండా ఇంతటి సాహాసం చేయడం అసాధ్యం అన్న టాక్ ఈ ఉదంతం జరిగిన తొలి రోజుల్లోనే వ్యక్తం కాగా, పోలీసుల విచారణ అనంతరం ఇదే నిజమవ్వడం మలయాళ చిత్ర పరిశ్రమను షాకింగ్ కు గురిచేసే అంశం.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

కొండా సురేఖ స్వరంలో మార్పు…అభ్యర్ధనల నుంచి వార్నింగ్ వరకు

తెలంగాణ అధికార పార్టీ లో కొండా సురేఖ వివాదం ఆరని చిచ్చు మాదిరి అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని ఇబ్బంది…

55 seconds ago

Babar Azam Failed as Captain? ‘Dummy Cap’ Tag Given

Pakistan have made several changes to their Test team during the England series, and former…

32 minutes ago