Telugu

లోకల్ వార్… హాట్ టాపిక్ గా పులివెందుల, పిఠాపురం

ఏపీలో జరిగిన స్థానిక ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ నేడు మొదలయ్యింది. అయితే ఇందులో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకర్గమైన పులివెందుల, డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం మీదే అందరి ద్రుష్టి.

నాడు వైసీపీ కుప్పం గెలుపుకి నేడు పులివెందులలో టీడీపీ గెలుపు బదులు చెప్పనుందా.? వైఎస్ కంచుకోటలో వైసీపీ ఓటమి సాధ్యమవుతుందా.? టీడీపీ ఈ స్థానిక ఎన్నికలతో పులివెందులలో కొత్త రాజకీయ చరిత్ర రాయబోతుందా.? ఇలా అనేక ప్రశ్నలకు పులివెందుల ఎన్నికల ఫలితాలు బదులు చెప్పనున్నాయి.

ADVERTISEMENT

ఇక పిఠాపురం విషయానికొస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కావడంతో ఇక్కడ జనసేన గెలుపు టీడీపీ, జనసేన మధ్య ఉన్న మిత్రధర్మానికి కొలమానం కానుంది. నాటి పవన్ విజయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ కీలక పాత్ర పోషించారు.

కానీ ఇప్పుడా పరిస్థితులు అక్కడ కనిపించడం లేదు. స్థానికంగా jsp నేతలకు టీడీపీ వర్మ కు మధ్య చాల విషయాలలో రాజకీయ విభేదాలు రావడం, జనసేన వైసీపీ నుంచి వచ్చిన దొరబాబు ని పార్టీలో ఆహ్వానించడంతో పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య పొలిటికల్ గాప్ కాస్త పెరిగినమాట వాస్తవమే.

ఈ నేపథ్యంలో పిఠాపురంలో జనసేన, టీడీపీ మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ సక్రమంగా జరిగిందా.? వారిద్దరు తమ ఉమ్మడి రాజకీయ ప్రత్యుర్థి ఓటమి కోసం క్షేత్ర స్థాయిలో కలిసి పనిచేశారా? లేదా.? అనేది పిఠాపురం జనసేన గెలుపే సమాధానం చెపుతుంది.

ప్రస్తుత కౌంటింగ్ ప్రకారం:

పవన్ కళ్యాణ్ Constituency పిఠాపురంలో JanaSena లాజర్ బాబు Lead!

పిఠాపురం: JanaSena 5, TDP 1, Independents 3

గొల్లప్రోలు: TDP 3, JanaSena 1, Independents 2

Counting ఇంకా కొనసాగుతోంది!

పులివెందుల మున్సిపల్ పోస్టల్ బ్యాలెట్లో వైసీపీ ముందంజలో కొనసాగుతుంది.

వైసీపీ: 84 ఓట్లు

టీడీపీ: 61 ఓట్లు

నోటా: 4 ఓట్లు

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

YSRCP Leaders Face Fresh Heat as ED Summons Ambati, Police Book Jagan

The legal pressure on YSRCP leaders is mounting, with the Enforcement Directorate summoning former minister…

19 minutes ago

End of an Era! Cricket Legend Announces Retirement

Glenn Maxwell's international career has come to an end after 14 years with Australia. The…

38 minutes ago