Telugu

ఆ హీరో అరెస్ట్ తో షాక్ అయ్యానన్న హీరోయిన్!

మలయాళ స్టార్ హీరో దిలీప్‌ అరెస్టుతో అందరి లాగానే తాను కూడా షాక్‌ కి గురయ్యానని హీరోయిన్ భావన తెలిపింది. కేసు పురోగతి నేపథ్యంలో ఓ ప్రకటన విడుదల చేసిన భావన… దిలీప్‌ పేరును ప్రస్తావించకుండా… పోలీసులు అరెస్టు చేసిన హీరోతో తాను చాలా సినిమాల్లో పని చేశానని గుర్తు చేసుకుంది. ఆయనతో తనకు ఎలాంటి రియల్‌ ఎస్టేట్‌, ఆర్థిక వ్యవహారాలు లేవని తెలిపింది.

ADVERTISEMENT

కొన్ని వ్యక్తిగత సమస్యల కారణంగానే తమ మధ్య స్నేహ బంధం ముగిసిపోయిందని తెలిపింది. అరెస్టు అనంతరం దిలీప్‌ చెబుతున్నట్టు… ఆయన నేరం చేసి ఉండకపోతే నిజం తప్పకుండా బయట కొస్తుందని, ఈ కేసులో వాస్తవాలు త్వరగా బయటకు రావాలని, దోషులు తప్పించుకోకూడదని పేర్కొంది. అదే సమయంలో అమాయకులు శిక్షకు గురికాకూడదని చెప్పింది.

ఫిబ్రవరిలో భావనపై జరిగిన లైంగక దాడి అనంతరం పోలీసులు ఆమె పేరును అధికారికంగా వెల్లడించకుండా, ‘ఒక మలయాళ నటి’ అని మాత్రమే పేర్కొన్నారు. అయితే ఆమె పేరును సోషల్‌ మీడియా ద్వారా నటుడు అజు వర్ఘీస్‌ ఉద్దేశపూర్వకంగా వెల్లడించాడు. దీంతో లైంగిక దాడి బాధితురాలి పేరును వెల్లడించిన నేరానికి గాను అతనిపై ఐపీసీ సెక్షన్‌ 228(ఏ) ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

కొండా సురేఖ స్వరంలో మార్పు…అభ్యర్ధనల నుంచి వార్నింగ్ వరకు

తెలంగాణ అధికార పార్టీ లో కొండా సురేఖ వివాదం ఆరని చిచ్చు మాదిరి అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని ఇబ్బంది…

1 minute ago

Babar Azam Failed as Captain? ‘Dummy Cap’ Tag Given

Pakistan have made several changes to their Test team during the England series, and former…

32 minutes ago