
అయితే ఉన్న పళంగా మళ్ళీ వాయిదా పడొచ్చు అన్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఏపీలో 100% ఆకుపెన్సీ మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడం.. అలాగే రేట్ల జీవో రాకపోవడంతో ఎవరి అనుమానాలు వారికి ఉన్నాయి. అయితే 100% ఆకుపెన్సీని ప్రభుత్వం ఇచ్చేసింది.
కానీ టిక్కెట్ రేట్లకు సంబంధించిన జీవో ఇప్పట్లో రాదు అని తేలిపోయింది. ఆ ఇష్యూకు సంబంధించిన కమిటి వారంలో నివేదిక ఇస్తాం అని ప్రకటించింది. వారంలో ప్రభుత్వానికి నివేదిక ఆ తరువాత ఒక వారంలో జీవో అనుకుంటే పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది.
ప్రభుత్వంలోని వారి అభిప్రాయం కూడా అదే కావొచ్చు. ఈ రిలీజ్ డేట్ పోతే ఏప్రిల్ 1… అంటే “ఆర్ఆర్ఆర్” వచ్చిన వారానికి.. థియేటర్లకు కూడా ఇబ్బంది పడాలి అలాగే “ఆర్ఆర్ఆర్” హంగామాను కూడా తట్టుకుని నిలబడాలి. ఒక రకంగా ముందు నుయ్యి వెనుక గొయ్యి.
అయితే ఈ ఒత్తిడిని తట్టుకుని ముందడుగు వెయ్యడానికే నిర్ణయించుకున్నాడు నాగవంశీ. ఫిబ్రవరి 25నే వస్తున్నాం అని తేల్చి చెప్పేశాడు. ధైర్యే సాహసే లక్ష్మి… ఇబ్బందులు ఉన్నా భీమ్లాతో పవన్ కళ్యాణ్ ను మొట్టమొదటగా నూరు కోట్ల క్లబ్ లో నిలబెడతారేమో చూద్దాం.
Delhi witnessed heightened political tension as the Cockroach Janta Party (CJP) called for protests against…
Kona Venkat has strong words for directors who shoot excessive footage and later throw away…