
తాజాగా శనివారం అమ్మమ్మ అశిడోర్జితో కలిసి నాగార్జునకొండను సందర్శించిన బుల్లి భూటాన్ యువరాజు… గత జన్మలో ఆ కొండపై తాను తిరిగిన ప్రదేశాలను అమ్మమ్మకు చూపించాడు. తనకు కలలో కనిపించే ఐదు తలల పాము అప్పట్లో ఈ కొండపైనే తిరిగేదని పేర్కొన్నాడు. ఇప్పుడిక్కడ ఉన్న విగ్రహం బుద్ధుడిది కాదని, అది ఓ మాత విగ్రహమని, అది అప్పట్లో నది మధ్యలో ఉండేదని పేర్కొన్నాడు.
తన మనవడు కారణజన్ముడని పేర్కొన్న యువరాజు అమ్మమ్మ… నాగార్జునకొండకు రోజూ పడవలో వెళ్లి వచ్చినట్టు మనవడికి కలలు వస్తున్నాయని, అందుకే నాగార్జున సాగర్ సందర్శనకు వచ్చామని వివరించారు. నాగార్జున కొండను సందర్శించిన యువరాజు కుటుంబ సభ్యులు అక్కడి మ్యూజియం, సింహళ, బౌద్ధ స్థూపాలు, స్నానఘట్టాలు, అశ్వమేథ యాగశాల తదితర వాటిని సందర్శించారు. దలైలామా నాటిన బోధి మొక్కకు పూజలు చేశారు.
As we have already informed our readers, for the first time in Bigg Boss Telugu…
The municipal elections in Andhra Pradesh ended on November 1, but the political battle did…