Telugu

ఎలివేషన్లు మెసేజుల మధ్య నలిగిపోయిన బిచ్చగాడు 2

ఒక బ్లాక్ బస్టర్ తాలూకు ప్రభావం ఏళ్ళ తరబడి ఉంటుందని చెప్పడానికి బిచ్చగాడుని మించిన ఉదాహరణ అక్కర్లేదు. నిజానికి విజయ్ ఆంటోనీకి తెలుగులో ఎప్పుడో మార్కెట్ పోయింది. హౌస్ ఫుల్ నుంచి కనీస ఓపెనింగ్స్ తెచ్చుకోలేని స్థాయికి దిగిపోయాడు. కానీ బిచ్చగాడు 2 విషయంలో జనంలో బయ్యర్లలో ఈ మాత్రం ఆసక్తి కనిపించడానికి కారణం ఫస్ట్ పార్ట్ తాలూకు హ్యాంగోవర్ తప్ప మరొకటి కాదు. ఈసారి కూడా ఏదో డిఫరెంట్ గా ట్రై చేశాడన్న అభిప్రాయం ట్రైలర్ చూసినప్పుడు కలిగింది. ఇందులో అంత విషయముందా

ADVERTISEMENT

ఇండియాలో ఏడో ధనవంతుడైన విజయ్ గురుమూర్తి(విజయ్ ఆంటోనీ)ఆస్తి మీద కన్నేసిన స్నేహితులు అతన్ని నమ్మించి మోసం చేసి మెదడు మార్పిడి చేయిస్తారు. తమ మాట వినే సత్య(విజయ్ ఆంటోనీ)ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడతారు. అయితే కడు పేదరికంతో చిన్నప్పుడు తప్పిపోయిన చెల్లి కోసం వెతుకుతున్న సత్య వాళ్ళిచ్చిన పనికి ఒప్పుకుని గురుమూర్తి ప్లేసులోకి వస్తాడు. అంత సంపద చూసేసరికి దీంతో పేదవాళ్లకు ఏదైనా మంచి చేయాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత బోలెడు కథుంది.ఆర్ నారాయణమూర్తి, దాసరి గారి రేంజ్ లో దీనికి కథ స్క్రీన్ ప్లే సంగీతం ఎడిటింగ్ దర్శకత్వం అన్నీ విజయ్ ఆంటోనీనే వహించాడు

మంత్రాలకు చింతకాయలు రాలవు కానీ తెరమీద చేసే సెంటిమెంట్ కనికట్టుకి ఖచ్చితంగా కాసులు రాలతాయి. బిచ్చగాడులో వర్కౌట్ అయ్యింది ఇదే. కానీ ఈ రెండో బిచ్చగాడుకి వచ్చేటప్పటికీ విజయ్ ఆంటోనీ కంటెంట్ కన్నా ఎక్కువ హంగులు సందేశాల మీద దృష్టి పెట్టడంతో కీలకమైన చెల్లి ఎమోషన్ పూర్తిగా పక్కదారి పట్టేసింది. దీంతో చివరి సీన్లో వాళ్ళు కలుసుకునే సన్నివేశం ఉద్విగ్నంగా అనిపించాల్సింది పోయి ఒక నిర్లిప్త భావం కలిగిస్తుంది. నమ్మశక్యం కాని పాయింట్ తో మొదలుపెట్టిన బిచ్చగాడు 2 ఎప్పుడైతే సత్య ఫ్లాష్ బ్యాక్ ని విప్పుతుందో అక్కడి నుంచి పట్టాలు తప్పుతూ వెళ్ళింది. అంత సుదీర్ఘమైన చైల్డ్ ఎపిసోడ్ అవసరమే లేదు.

విచిత్రంగా విజయ్ ఆంటోనీ ఈసారి ఎక్కువ అతిశయోక్తులకు వెళ్ళిపోయాడు. అంబానీ రేంజ్ పెద్దమనిషి కాసేపు అమాయకంగా కాసేపు ముభావంగా ఉంటాడు. ముఖ్యమంత్రికి అయిదు వేల కోట్లు విరాళంగా ఇచ్చే స్థాయి ఉండి స్వంత మెదడుతో ఆలోచించడు. ఒక పోలీస్ ముందు నిర్భయంగా నిజం చెప్పలేని సత్య కాసేపటికే సిఎంకి వార్నింగ్ ఇచ్చేస్తాడు. యాంటీ బికిలి అంటూ ఏదో కొత్తగా చెప్పబోయాడు కానీ తెరమీద అది లాజిక్స్ కి కిలోమీటర్ దూరంలో ఆగిపోయింది. పోనీ క్లైమాక్స్ లో ఏదైనా నమ్మేసేలా ట్విస్టులు పెడతారనుకుంటే రాఖీ, ఠాగూర్ తరహాలో క్లాసులు పీకించబోయి అటు ఇటు కాకుండా చేశాడు. కీలకమైన భావోద్వేగాలు పూర్తిగా తగ్గిపోయి దెబ్బ కొట్టాయి

నిజానికి మంచి పాయింట్ ని చేతులారా విజయ్ ఆంటోనీ వృథా చేసుకున్నాడు. డ్రామాకు బోలెడు స్కోప్ ఉన్నా మెసేజ్ తో పాటు ఎలివేషన్ల మీద అవసరానికి మించి శ్రద్ధ పెట్టడంతో ఫ్లాష్ బ్యాక్ తో మొదలు చివరి దాకా మధ్యలో ఒకటి రెండు మాస్ యాక్షన్ బ్లాక్స్ తప్ప ఎక్కడ వావ్ అనిపించుకోలేకపోయాడు. క్యాస్టింగ్ ఎంత బాగా కుదిరినప్పటికీ అయిదారు బాధ్యతలు నెత్తినవేసుకున్న విజయ్ ఆంటోనీ వాటిని న్యాయం చేకూర్చే క్రమంలో తానే బ్యాలన్స్ తప్పిపోయాడు. బిచ్చగాడు మెట్రో ట్రైన్ లో సౌకర్యంగా ప్రయాణించిన అనుభూతినిస్తే బిచ్చగాడు 2 సీట్లు లేని పాసెంజర్ బండిలో ఇరుక్కున్న ప్రయాణికుల మధ్య నలిగిపోయింది

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Jailer 2 BO 2nd Day: Rajinikanth’s 1000 Crore Dream ON?

Rajinikanth's Jailer 2 is maintaining strong momentum at the box office on its second day,…

47 minutes ago

Why Ramayan Release Crucial for Shah Rukh Khan’s King?

Shah Rukh Khan’s fans have been eagerly waiting for an update on his next film,…

1 hour ago