
అందుకే పెద్ద హీరోల కొత్త రిలీజులన్నీ ఇందులోనే పడాలని కోరుకుంటారు. 28న రాబోయే ఏజెంట్, పొన్నియన్ సెల్వన్ 2ల మధ్య సుదర్శన్ కోసం మొదలైన రచ్చ గంటల తరబడి కొనసాగి చివరికో విజేతను తేల్చింది. పీఎస్ 1 పంపిణి చేస్తున్నది దిల్ రాజన్న సంగతి తెలిసిందే. పైకి తనది కాదని చెబుతారు కానీ సుదర్శన్ 35 ఎంఎం ఉన్నది ఆయన కనుసన్నల్లోనే అన్నది ఓపెన్ సీక్రెట్. డిమాండ్ ఉన్న టైంలోనూ బలగం లాంటి అంచనాలే లేని చిన్న సినిమాను అందులో వేయడం కన్నా ఉదాహరణ అక్కర్లేదు. సంక్రాంతి టైంలో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యలలో ఒకదానికి ఇమ్మన్నా ఆయన తన వారసుడునే వేయించి నెలకు పైగానే ఆడించారు.
దీంతో సహజంగానే పొన్నియన్ సెల్వన్ 2 కి సుదర్శన్ ని కేటాయించి పేపర్ యాడ్స్ ఇచ్చారు. అవి ఈ రోజు ప్రింట్ అండ్ ఆన్ లైన్ లో వచ్చేశాయి. ఏజెంట్ కి సంధ్యతో పాటు దేవిని సెట్ చేయాలని ప్రాథమికంగా అనుకున్న ప్లాన్. కానీ అక్కినేని అభిమానులకు ఇది సుతరామూ ఇష్టం లేదు. ఎలాగైనా సరే ఇంత భారీ బడ్జెట్ తో వచ్చిన అఖిల్ మూవీని ఏజెంట్ కే వచ్చేలా చేయాలని రంగంలోకి దిగారు. పలుదఫాల చర్చలు మంతనాల అనంతరం విజయం సాధించారు. చివరికి బొమ్మ మారి బుక్ మై షోలో అఖిల్ కి సుదర్శన్ 35 ఎంఎం వచ్చినట్టు బుకింగ్స్ చూశాక కన్ఫర్మ్ అయ్యింది.
ఎక్కడ ఆడిస్తే ఏముంది సినిమా బాగుంటే దానికేం సంబంధం అనే లాజిక్ లో అర్థముంది కానీ సుదర్శన్ ట్రాక్ రికార్డు చూస్తే ఎవరికైనా సుదర్శన్ లో పడాలనే ఆశ కలగడం సహజం. అఖండ, ఆర్ఆర్ఆర్ లు రికార్డు స్థాయిలో కలెక్షన్లు తెచ్చింది అందులోనే. స్క్రీన్, సౌండ్, మెయింటెనెన్స్ విషయంలో దీని తర్వాతే మిగిలినవి నిలుస్తుండటంతో ఇంత పోటీ నెలకొంటోంది. ఇంతకు ముందు 70 ఎంఎం కూడా ఉండేది కానీ తర్వాత తీసేశారు. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ 2కి దేవితో పాటు ఇతర స్క్రీన్లు కేటాయించబోతున్నారు. మొత్తానికి సెంటిమెంట్ల తర్వాత ఏవైనా అని మరోసారి ఈ ఉదంతం ద్వారా ఋజువవుతోందిగా. మనుషులకే కాదు థియేటర్లకూ ఎమోషన్లు ఉంటాయి కాబోలు.
Sara Ali Khan brings a burst of sunshine to traditional Indian fashion in a vibrant…
South Indian cinema has historically been aligned with commercial format of filmmaking, and this is…