
ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారు చూడగలిగే మరో వ్యక్తి తారక్ ని మాత్రమే. ఏం చెప్పాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా తారక్ తో మాత్రమే పంచుకోగలరు. బిగ్ బాస్ హౌస్ లో వారందరితో మాట్లాడిన ఎన్టీఆర్, తన సమయస్పూర్తి యాంకరింగ్ తో షోను మొత్తం దడదడలాడించేసాడు. ఇక తన డైలాగ్స్ తో మధుప్రియ వంటి వారికి ఎనర్జీ ఇచ్చే ప్రయత్నం చేసిన ఎన్టీఆర్, మొదటి వారం ప్రజలను విశేషంగా ఆకట్టుకున్న ఆర్టిస్ట్ గా ధనాధన్ ధన్ రాజ్ పేరును ప్రస్తావించారు.
అసలింతకీ ఈ షోకు ప్రేక్షకులు ఆదరణ ఎలా ఉంది? బయట ఉన్న ప్రేక్షకులకు వివిధ మాధ్యమాల ద్వారా ఈ విషయం తెలుస్తుంది గానీ, సమాచార వ్యవస్థ లేని బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారికి ఎలా తెలుస్తుంది? తారక్ మాత్రమే చెప్పాలి. ఇదే ప్రశ్నను హౌస్ లోని పార్టిసిపెంట్స్ తారక్ ను అడగగా… అవుట్ స్టాండింగ్, రాకింగ్ అంటూ జూనియర్ బదులిచ్చారు. ఈ షోకు టీఆర్పీ రేటింగ్స్ ఏ విధంగా ఉన్నాయన్న విషయం మరికొద్ది రోజుల్లో తేలనుంది గానీ, ఎన్టీఆర్ మాత్రం ‘అదిరిపోయే స్పందన’ వచ్చిందని చెప్పి హౌస్ లో ఉన్న వారిని ఉత్సాహపరిచారు.
Ravi Teja’s Irumudi has become the sensational blockbuster of the year, with the film now…
A social media user who posted a meme about Yash's Toxic on August 26 has…