
మరోవైపు ఐదుగురు మాత్రం హౌస్ లోకి వెళ్లడం ఖాయం అంటూ వినిపిస్తుంది. హీరో వరుణ్ సందేశ్, శ్రీముఖి, యాంకర్ సావిత్రి, నటి హేమ మన అందరికీ సుపరిచితులే. అదే విధంగా టీవీ నటి, వినయవిధేయ రామ, శతమానం భవతి వంటి సినిమాలలో చిన్న చిన్న పత్రాలు వేసిన హిమజ కూడా ఫైనల్ అని వినిపిస్తుంది. మిగతా వారు ఎవరో చూడాల్సి ఉంది. ఈ షో కోసం నలభై మందిని సెలెక్టు చేసి ఉంచారట. వారిలో 14 మంది మాత్రం హౌస్ లోకి వెళ్తారు. ఈ సారి సామాన్యులెవరూ హౌస్ లోకి వెళ్లరని సమాచారం.
జులై చివర్లో బిగ్ బాస్ 3 మొదలు కానుంది. 100 రోజుల పాటు జరగబోయే ఈ షోపై ఇప్పట్నుంచే భారీ అంచనాలున్నాయి. మొదటి రెండు సీజన్లకు ఎన్టీఆర్, నాని హోస్టులు కాగా మూడోసారి నాగార్జున రంగంలోకి దిగుతున్నాడు. తమిళ, హిందీ బిగ్ బాస్ షోలకు అన్ని సీజన్లకు ఒకే హోస్ట్ ఉండగా తెలుగుకు మాత్రం మూడు సీజన్లకు ముగ్గురు అయ్యారు ఇప్పటికి. ఇప్పటివరకూ బిగ్ బాస్ హోస్ట్ గా చేసిన ఎన్టీఆర్, నానిలకు ఇంతకు ముందు టీవీలో చేసిన అనుభవం లేకపోగా… నాగార్జున మాత్రం ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు షో ను హోస్ట్ చేసి సక్సెస్ ఫుల్ అనిపించుకున్నారు. మరి ఆయన బిగ్ బాస్ లో చేసే రచ్చ ఎలా ఉంటుందో చూడాలి.
రామాయణ, మహాభారతాల ఆధారంగా అనేక భాషల్లో అనేక సినిమాలు వచ్చాయి. అయినా ఇంకా తీస్తూనే ఉన్నారు. మరో వందేళ్ళ తర్వాత…
A massive data leak at the Central Board of Film Certification (CBFC) has exposed records…