
[m9ad]
డైరెక్ట్ ఫినాలేకు వెళ్లే అవకాశాన్ని బహుమతిగా ఇచ్చే టాస్క్ లో భాగంగా, ఇసుక కంటెయినర్ లోని ఇసుకను కాపాడుకుంటూ ఉండాలి. దాన్ని మిగతావారు కింద పడేసే ప్రయత్నం చేస్తుండాలి. ఈ టాస్క్ రెండు లెవల్స్ లో సాగుతుంది. తొలి దశలో కౌశల్ కంటెయినర్ ను పడేయటానికి సామ్రాట్, తనీష్ లు పెద్ద ప్రయత్నమే చేశారు. వీరిద్దరూ రోల్ రైడాకు మద్దతుగా కూడా నిలిచారు.
ఈ క్రమంలో తనీష్, కౌశల్ ఒకరిని ఒకరు నెట్టుకున్నారు. కంటెయినర్ రాడ్స్ విరగ్గొట్టడం, అద్దాలు పగులగొట్టడం వంటివి జరిగాయి. దీంతో రంగంలోకి దిగిన బిగ్ బాస్, శారీరక హింస జరుగుతోందని, అందరినీ బయటకు పంపిస్తానని కటువుగా హెచ్చరించాల్సి వచ్చింది. ఆపై టాస్క్ ను మధ్యలోనే రద్దు చేసి, ఈ పోటీలో రోల్ గెలిచాడని చెబుతూ, అతన్ని లెవల్ 2 పోటీకి పంపుతున్నట్టు బిగ్ బాస్ ప్రకటించాడు.
A US visa applicant recently took to Reddit to share their experience with the visa…
Following the back to back failures of Idli Kadai and Kara, Dhanush is all set…