
దివంగత దర్శకుడు కె.బాలచందర్ నుంచి తాను ఎన్నో నేర్చుకున్నానని వెల్లడించారు. నైపుణ్యాలను ఎలా మెరుగుపరుచుకోవచ్చో ఫిలిం స్కూల్ నేర్పుతుందని తెలిపారు. గతంలో కొంతమంది జర్నలిస్టులు తన గురించి భారతీరాజాను ప్రశ్నించారని… అప్పుడాయన రజనీకాంత్ మంచి వ్యక్తి అన్నారని, తానొక మంచి నటుడిని అని భారతీరాజా ఎప్పటికీ అంగీకరించరని చమత్కరించారు. ‘ఆయనను నటుడిగా ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు?’ అని ఇప్పటికీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తారని అన్నారు.
అనంతరం భారతీరాజా మాట్లాడుతూ, రజనీకాంత్ చాలా సాధారణమైన వ్యక్తి అని, ’16 వయదిన్నెల్’ చిత్రంలో ఆయన ప్రతినాయకుడి పాత్ర పోషించారని, ఇప్పుడాయన ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారని, అందుకు చాలా సంతోషమని ఆయన తెలిపారు. అలాగే రజనీ జీవితంలో తనది చాలా చిన్న పాత్ర అని, ఆయన సినీ జీవితంలో ఎదుగుదలలో తనది కీలక పాత్ర అని ఎన్నటికీ అననని, స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి రజనీకాంత్ అని భారతీరాజా కొనియాడారు.
Prabhas fans may finally start getting more updates about Fauzi from this month. Mythri Naveen…
After the arrival of the Revanth Reddy government in Telangana, the food safety authorities have…