
లండన్ లోని ఫైవ్ స్టార్ హోటల్ మే ఫెయిర్ హోటల్ లో ఉండేందుకు బిపాసా జంటకు గదులు కూడా చేశామని, అయితే అనుకున్న దాని కంటే ఎక్కువ రోజులు ఉండటంతో మరో ఫైవ్ స్టార్ లో రూమ్స్ బుక్ చేయాల్సి వచ్చిందని, అయినప్పటికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఆమెకు అడ్వాన్స్ తో పాటు ప్రయాణ ఖర్చుల కింద నగదు రూపంలో కొంత డబ్బు కూడా ఇచ్చామని చెప్పారు. ఒక్కొక్క సిమ్ కార్డులో ఐదు పౌండ్లు చొప్పున రీఛార్జి చేయించిన రెండు లోకల్ సిమ్ కార్డులను లండన్ లో దిగిన వెంటనే బిపాసాకు అందజేశామని తెలిపారు.
అయితే ఇంత తక్కువ మొత్తంలో రీఛార్జి చేస్తారా? అంటూ ఆ సిమ్ కార్డులను తన ముఖం పైకి బిపాసా విసిరికొట్టిందని రోణిత శర్మ రేఖీ ఆరోపించారు. ఆమె ఈ విధంగా చేసినప్పటికీ తాము పట్టించుకోలేదని, షో కు హాజరు కావాలని బతిమలాడిన బిపాసా వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అన్ని విధాలా నష్టం చేసిన బిపాసాను వదిలిపెట్టబోమని రోణిత స్పష్టం చేసారు. అయితే, ఈ ఆరోపణలను బిపాసా కొట్టిపారేస్తూ… ఇప్పటివరకు తన కెరీర్ లో ఈ విధంగా ఎప్పుడూ ప్రవర్తించలేదని బిపాసా చెప్పుకొచ్చింది.
తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో దాదాపు కనుమరుగయిపోయిందనే చెప్పాలి. తెలంగాణలో టీడీపీ…
Rashmika Mandanna has achieved another major milestone. The actress, who began her career with Kirik…