Telugu

బీజేపీ లేకుంటే టీడీపీకి డిపాజిట్లు రావట!

బీజేపీ నాయకుల ఆత్మవిశ్వాసం చూస్తుంటే ముచ్చటేస్తాది. టీడీపీ దగ్గర 15 సీట్లు పొత్తులో భాగంగా తీసుకుని కనీసం 5 సీట్లు కూడా గెలవని ఆ పార్టీ, టీడీపీని బెదిరిస్తోంది. తమతో పొత్తు లేకపోతే టీడీపీకి వచ్చే ఎన్నికలలో డిపాజిట్లు కూడా దక్కవని ఆ పార్టీ జాతీయ నేత చల్లపల్లి నరసింహా రెడ్డి అన్నారు.

ADVERTISEMENT

2009 తరువాత జరిగిన ఉపఎన్నికలలో టీడీపీకి 17 చోట్ల డిపాజిట్లు దక్కలేదని ఆయన గుర్తు చేసారు. తమతో పొత్తు లేకుండా చంద్రబాబు ఎప్పుడు గెలవలేదని ఆయన అన్నారు. అదేవిధంగా తాము 2019లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలో ఇంకా నిర్ణయించుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు. అయితే 2009 తరువాత జరిగిన ఉపఎన్నికలలో ఎన్ని చోట్ల పోటీ చేసిందో ఆయన చెప్తే బీజేపీ అసలు స్థితి తెలుస్తుంది.

అదే విధంగా వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమాత్రం ఉండదని ఆయన చెప్పుకొచ్చారు. అటు టీడీపీకి డిపాజిట్లు దక్కక, ఇటు పవన్ కళ్యాణ్ ప్రభావం కూడా లేకపోతే వచ్చే ఎన్నికలలో బీజేపీ ప్రభంజనమే అన్నమాట. ఈ లెక్కన వచ్చే సరి ఆంధ్ర ప్రదేశ్ లో పవర్ బీజేపీ, వైకాపా మధ్యనే ఉంటుందన్నమాట.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

No Five Star Hotels, No Team India? What’s Really Happening?

The Indian cricket team has been linked with reports of a possible Asian Games pullout…

13 minutes ago

August BO: Ravi Teja & Yash Create History in Opposite Ways

August turned out to be a month of extreme contrasts at the box office. There…

33 minutes ago