Telugu

షాకింగ్ – 130 మందిని చంపిన ఓ ‘వీడియో గేమ్’

రష్యా, సౌదీ అరేబియాలను ఓ ‘వీడియో గేమ్’ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ రెండు దేశాలను హడలెత్తిస్తున్న ఆ వీడియో గేమ్ లో ఏముందని ఆశ్చర్యపోతున్నారా? చెప్పుకునేందుకు అది వీడియో గేమే… కానీ, అది ఆడడం మొదలుపెట్టారంటే చివరకు ప్రాణాలు హరిస్తుంది. దీని బారిన పడి 130 మంది రష్యన్ యువతీ యువకులు ప్రాణాలు కోల్పోయారంటే… ఇందెంత ప్రమాదకరమైన ఆటో అర్ధం చేసుకోవచ్చు.

ADVERTISEMENT

ఇంతలా హడలెత్తిస్తున్న ఈ వీడియో గేమ్ పేరు ‘బ్లూ వేల్‌.’ 10-14 ఏళ్ల పిల్లలే లక్ష్యంగా రూపొందించిన ఈ గేమ్‌ లో వారి భావోద్వేగాలతో ఆడుకుంటూ వారిని హతమార్చడమే లక్ష్యంగా ముగుస్తుంది. స్మార్ట్ ఫోన్ లో దీనిని డౌన్ లోడ్ చేసుకున్న అనంతరం చిన్న చిన్న సవాళ్లను విసురుతుంది. వాటిని విజయవంతంగా పూర్తి చేస్తే… అసలు కథ మొదలవుతుంది. టాస్క్ పూర్తి చేశారో లేదో చెప్పాలంటే… మీరు పూర్తి చేసిన టాస్క్ తాలుకు ఫోటోలు దానికి పంపాల్సి ఉంటుంది.

ఇలా రెండు రోజులు ఆడిన తరువాత దానికి మీరు బానిసయ్యారు అని అర్ధమైన తరువాత, గేమ్‌ స్థానంలో ‘మెంటార్‌’ ఎంటర్‌ అవుతాడు. ఇక అప్పటి నుంచి ‘మృత్యుక్రీడ’ మొదలవుతుంది. అర్థరాత్రి భయం గొలిపే చలన చిత్రాలను చూడమంటాడు. అది డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ అని సంబోధిస్తాడు. ఆ తరువాత గాఢ నిద్రలో ఉన్న సమయంలో లేవాలని ఆదేశిస్తాడు. చర్మంపై కత్తితో కొన్ని బొమ్మల ఆకారాలను గీసుకోమంటాడు. అలాగే సరదాగా నగ్న చిత్రాలను షేర్‌ చేయమంటాడు. ఇవన్నీ టాస్క్ లలో భాగమే..!

బాయ్‌ లేదా గర్ల్‌ ఫ్రెండ్‌ తో డేటింగ్‌ చేయమంటాడు. నిజంగా డేటింగ్ చేశావో లేదో తెలియాలంటే ఆ వీడియోలు లేదా ఫోటోలు పంపాలని సూచిస్తాడు. ఇలా టీనేజర్లను తప్పుల మీద తప్పులు చేయాలని ప్రోత్సహించి మరీ చేయిస్తాడు. ఇలా రోజుకో టాస్క్ పేరిట 50 రోజులు వారిని ఆటాడిస్తాడు… ఈ గేమ్ మత్తులో ఉన్న టీనేజర్లు… ఇదంతా గేమ్ లో భాగమని భావిస్తారు… కానీ 50వ రోజు ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపిస్తాడు. ఆత్మహత్య చేసుకోవడంతో గేమ్, ప్రాణం రెండూ పూర్తవుతాయి.

ఇలా ఈ బ్లూవేల్ గేమ్ ఆడి… ఇద్దరు యువతులు ఆత్మహత్యకు పాల్పడడంతో రష్యా పోలీసులు దర్యాప్తులో ఈ సంచలన విషయాలు కొనుగొన్నారు. ఒక వేళ గేమ్ ఆడి ప్రాణం తీసుకోబోమని ఎవరైనా మానసిక ధైర్యం ప్రదర్శించారా? వారిపై మరో అస్త్రం విసురుతాడీ సైకో మెంటార్. ఈ గేమ్‌ వెనుక ఉన్న వ్యక్తుల నుంచి టీనేజర్లకు బెదిరింపు కాల్స్‌ వస్తాయి. వారు అప్పటికే టీనేజర్లతో పలు తప్పులు చేయించి ఉంటారు. వారి నగ్న చిత్రాలు.. డేటింగ్‌ వీడియోలు బయటపెడతామని.. కిడ్నాప్‌ చేసి చిత్ర హింసలకు గురి చేస్తామని బెదిరిస్తారు.

దీంతో భయపడి కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అందువల్ల ఈ గేమ్‌ జోలికి ఎవరూ వెళ్లవద్దని మానసిక నిపుణులు, పోలీసులు సూచిస్తున్నారు. 130 మందికి పైగా టీనేజర్ల ఆత్మహత్యలకు ‘బ్లూ వేల్‌’ గేమ్‌ కి లింక్‌ బయట పడటంతో ఈ గేమ్‌ సృష్టికర్త ఫిలిప్‌ బుడేకిన్‌ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఇతను మానసిక రోగి కావడంతో సైకియాట్రిక్‌ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ గేమ్‌ వెనుక కేవలం ఫిలిప్‌ మాత్రమే ఉన్నారా? లేక మరెవరైనా ఉన్నారా? అన్న కోణంలో రష్యా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

బ్రిటన్‌, దుబాయ్‌, అమెరికా ఇలా చాలా దేశాల్లో ఈ వీడియోగేమ్ పై ఆందోళన వ్యక్తమవుతోంది. బ్రిటన్‌ లోని అన్ని పాఠశాలలూ ఈ గేమ్‌ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ‘‘మీ పిల్లలు బ్లూవేల్‌ గేమ్‌ ఆడకుండా జాగ్రత్తపడాలని’’ తల్లిదండ్రులకు ఎస్‌ఎంఎస్ లు, ఈ మెయిళ్లు, లేఖలు పంపుతున్నాయి. పోలీసులు కూడా తల్లిదండ్రులకు ఈ గేమ్‌ పై హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అమెరికా, దుబాయ్‌ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అంతే కాదు ఈ దేశాల్లో తల్లిదండ్రులు బ్లూవేల్‌ వీడియో గేమ్ కి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో ఓ ఉద్యమం చేపట్టారు. ఈ గేమ్‌ ఎంత ప్రమాదమో చెబుతూ ఇతరుల్లో అవగాహన పెంచుతున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Pics: Nimrit Kaur Flaunts Sultry Grace In Blue Saree

Nimrit Kaur is redefining raw ethnic elegance with an earthy, unapologetically sultry photoshoot that is…

24 minutes ago

Romanchakam Review: Thin Story, Patchy Laughs

BOTTOM LINE Thin Story, Patchy Laughs RATING 2/5 Story, Screenplay, Director: Venu Gopal Reddy Cast:…

45 minutes ago