
అప్పటివరకు సజావుగా సాగుతున్న లైవ్ షోలోకి చెవిరెడ్డి చర్చలో పాల్గొనగానే, ఒక్కసారిగా సహనం కోల్పోయిన బొండా ఉమా… “ఎర్రచందనం దుంగలను దొంగిలించే దొంగవంటూ, దుంగలను కొట్టేసిన కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చావు కదా…” అంటూ విమర్శలు చేస్తూ ‘అరేయ్’ అంటూ చెవిరెడ్డిని సంభోదించారు. ఒక్కసారితో ఊరుకోకుండా పదే పదే అదే పదం వినియోగించడంతో చెవిరెడ్డి కూడా బొండా ఉమాను ‘ఒరేయ్’ అంటూ ప్రతిదాడి చేసే ప్రయత్నం చేసారు.
తనను రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, దమ్ముంటే తనపై ఆధారాలతో కేసు పెట్టాలని చెవిరెడ్డి సవాల్ చేశారు. ఈ క్రమంలో ఈ సారి పట్టుబడితే ‘టాడా’ చట్టం కిందే కేసు బుక్ చేస్తామంటూ బొండా హెచ్చరించారు. ఓ పక్కనుండి షో నిర్వాహకుడు వీరిద్దరిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఇద్దరిలో ఒక్కరు కూడా వెనక్కి తగ్గక పోవడం విశేషం. అయితే అసెంబ్లీ సభా స్పీకర్ చెప్పినట్లు… సదరు జర్నలిస్ట్ ఒకటికి వంద సార్లు విజ్ఞప్తులు చేయడంతో తమ తిట్ల పురాణానికి శుభంకార్డు వేసారు.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా, ఇతర విషయాల్లో కేంద్రం చేస్తున్న జాప్యం, నిర్లక్ష్యంపై జరుగుతున్న చర్చలో భాగంగా సదరు నేతలు చర్చించిన తీరు ఇది. వీరు చేసుకున్న తిట్లకు, ఆరోపణలకు, చేపట్టిన చర్చకు ఏమైనా సంబంధం ఉందా? అది మన నేతల సభ్యత… సంస్కారం..! కనీసం ఒకరిలో కాకపోతే మరొకరిలోనైనా ఈ అంశాలు ఉంటే పరిస్థితి ‘అరేయ్… ఒరేయ్…’ దాకా వచ్చియుండేది కాదు.
తెలుగు పరిభాషలో ఇవేమీ పెద్ద తిట్లు కాకపోవచ్చు. అయితే కొన్ని లక్షల మంది ప్రజలకు ప్రతినిధిగా వ్యవహరిస్తూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన సదరు నేతలు స్పందించాల్సిన విధానం మాత్రం కాదు. అలాగే కోట్ల మంది ప్రజలు వీక్షించే బుల్లితెరపై పలకాల్సిన పదాలు కావు. మన రాజకీయ నేతల తీరుతెన్నుల ఆలోచనలకు, ఆదర్శ భావాలకు మచ్చుతునకగా ‘అరేయ్… ఒరేయ్…’ పదాలు నిలుస్తున్నాయి..! అధికారం ఉందన్న అహంకారం ఒకరిదైతే… అధికారం లేదన్న ఆవేదన మరొకరిది…!
Folk dancer Madhuri Rathod has reportedly attempted suicide, triggering fresh controversy around her ongoing dispute…
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…