Telugu

బొత్స గతం మర్చిపోయినట్టు ఉన్నారు?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి నిన్న రాజధానిలో పర్యటించి రైతులకు సంఘీభావం తెలపడంపై అధికార పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని 25 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఆయన అప్పులపాలు చేశారని బొత్స విమర్శించారు.

భువనేశ్వరి రైతుల వద్దకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. గాజులు కాదు.. తీసుకున్న భూములు తిరిగి ఇవ్వాలన్నారు. అక్కడితో ఆగితే పర్లేదు నాడు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చింది చంద్రబాబు కాదా అని బొత్స సత్యనారాయణ నిలదీశారు. నిజమే చంద్రబాబు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారు అయితే అప్పుడు బొత్స ఎక్కడ ఉన్నారు?

ADVERTISEMENT

ఆయన కీలకంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే కదా విభజనకు తెరలేపింది? అప్పట్లో బొత్స ముఖ్యమంత్రి కూడా అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తే ఆయన ఇంటి మీద ప్రజలు దాడి చేశారు. ఆ తరువాత ఆరు నెలల పాటు ఆయన సొంత ఊరు వెళ్లకుండా ఉండిపోయారు.

ఆ తరువాత వచ్చిన ఎన్నికలలో కాంగ్రెస్ టిక్కెటు మీదే పోటీ చేసిన ఆయన, ఆయన కుటుంబ సభ్యులంతా ఓడిపోయారు. ఆ తరువాత ఇక లాభం లేదనుకుంటూ వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిపోయారు. గతమంతా మర్చిపోయి విభజనతో తనకు సంబంధం లేదన్నట్టు ఇప్పుడు బొత్స మాట్లాడటం ఏంటో?

Share
Published by

Recent Posts

Rashmika Dragged Again: Kannada Cinema Targeting Her?

Kannada cinema is increasingly proving that films made on modest budgets can find audiences beyond…

18 minutes ago

Akshay’s Big Gamble On #MeToo Accused: Why Now?

Akshay Kumar and Sajid Khan are reportedly joining forces once again, marking a reunion that…

47 minutes ago