Telugu

ముందస్తు కాదు మరో ఐదేళ్ళు మేమే… ఏం పీక్కొంటారో పీక్కోండి!

రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి మంత్రి పదవి దక్కించుకొనే గొప్ప నేర్పు, పలుకుబడి ఉన్న నేత మంత్రి బొత్స సత్యనారాయణ. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ప్రజలు మమ్మల్ని ఐదేళ్ళు రాష్ట్రాన్ని పాలించమని అవకాశం ఇచ్చారు కనుక ఐదేళ్ళు పూర్తయ్యేవరకు ఉంటాము. ముందస్తు ఎన్నికలు కాదు.. మరో ఐదేళ్ళు కూడా మేమే అధికారంలో కొనసాగుతాము. పవన్‌ కళ్యాణ్‌ ఎప్పటికైనా మళ్ళీ చంద్రబాబు నాయుడు పంచన చేరుతారని నేను మొదటి నుంచే చెపుతున్నాను. అదే జరుగబోతోంది.

పవన్‌ కళ్యాణ్‌కు ఏవైనా సమస్యలుంటే మాకూ చెప్పుకోవచ్చు. ఆయన జనవాణి సమావేశాలు పెట్టుకొంటే మాకెందుకు అభ్యంతరం? కావాలంటే 26 జిల్లాలలోనే కాదు పక్కనే ఒడిశాలో కూడా పెట్టుకోవచ్చు. జనసేన కార్యకర్తల చేత మా మంత్రులమీద దాడులు చేయించిన పవన్‌ కళ్యాణ్‌ మేమే జనసేనపై దాడులు చేయిచ్చామని నిందిస్తుండటం చాలా విడ్డూరంగా ఉంది.

ADVERTISEMENT

టిడిపి హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో జరిగిన దోపిడీ, అక్రమాల గురించి చంద్రబాబు నాయుడుని ఆయన ప్రశ్నించాలి. కావాలనుకొంటే మా సంక్షేమ పధకాల ఆడిట్ రిపోర్టులను కూడా పవన్‌ కళ్యాణ్‌ పరిశీలించుకోవచ్చు. మేము అన్నిటిలో చాలా పారదర్శకంగా ఉంటాము కనుకనే టిడిపి, జనసేనలు కలిసికట్టుగా పోటీ చేసినా రాష్ట్ర ప్రజలు మా పార్టీనే ఆదరిస్తారు,” అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

ముందస్తు ఎన్నికలు ఉంటాయనే ఖచ్చితమైన సమాచారం టిడిపి, జనసేనలకు అందబట్టే నారా లోకేష్‌ పాదయాత్రకు, పవన్‌ కళ్యాణ్‌ బస్సు యాత్రకు సిద్దమయ్యారు. కానీ వైసీపీ వెనక్కు తగ్గినట్లు తెలుసుకొని వారిద్దరూ కూడా తమ యాత్రలను వాయిదా వేసుకొన్నారు. కనుక వైసీపీ ఎప్పుడు ఎన్నికలకు వెళుతుందో బొత్స సత్యనారాయణ కంటే టిడిపి, జనసేనలకే బాగా తెలుసని అర్దమవుతోంది.

టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకోవడం ఏదో మహాపరాధం అన్నట్లు వైసీపీ నేతలు పదేపదే వాదిస్తుండటం వారి అభద్రతాభావాన్ని సూచిస్తోంది. ఒకవేళ ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే తాము ఎక్కడ ఓడిపోతామో అని వైసీపీ నేతలు లోలోన చాలా ఆందోళన చెందుతున్నట్లు అర్దమవుతోంది. అందుకే వారి అధినేత మొదలు ఎమ్మెల్యేల వరకు అందరూ రోజూ చంద్రబాబు, పవన్‌ నామస్మరణలో తరించిపోతున్నారు. ఈ మాయలో పడి వారు తమ ప్రభుత్వం రాష్ట్రానికి, ప్రజలకు ఏమైనా చేస్తోందా లేదా అనే విషయం చెప్పడం కూడా మరిచిపోతున్నారు పాపం!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Nani, Vijay Chase Mass Stardom: Can Nithiin Benefit?

Nani and Vijay Deverakonda are moving away from the romantic entertainers and emotional dramas that…

1 hour ago

Pics: Dharshna Stuns In A Bold Wine Red Outfit!!

Dharshna Sripal turns up the charm in this glossy, mood fresh gallery that blends soft…

2 hours ago