
రాజధాని తరలిపోతుందనే ప్రజల్లో ఉన్న ఆందోళనకు తాము వెళ్లి సమాధానం చెప్పుకుంటామని అన్నారు. అమరావతి రైతులు ధర్నా చేస్తున్నది కౌలు అందడం లేదనే తప్ప.. రాజధాని విషయంలో కాదని వ్యాఖ్యానించారు. రైతులకు కౌలు ఇచ్చే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. వారం పదిరోజుల్లో రైతులకు కౌలు అందే ఏర్పాటు చేస్తామని మంత్రి బొత్స హామీ ఇచ్చారు. కౌలు గురించి వర్రీ అవుతున్న రైతులు రాజధాని తరలిపోతుందన్న బెంగ ఉండదా?
అసలు బొత్స చెప్పే దాంట్లో లాజిక్ ఉందా? దాదాపుగా నాలుగు సంవత్సరాలు బీడు పట్టేసిన పొలాలు, ఒకపక్క రేట్లు భారీగా పడిపోతున్నా బాధ పడటం లేదు రైతులు అంటే నమ్మే పరిస్థితి ఉంటుందా? మరో వైపు రాజధానిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు. ఇన్సైడ్ ట్రేడింగ్ వివరాలను సరైన సమయంలో బయటపెడతామని అన్నారు. రాజధాని భూ అక్రమాలపై తమ వద్ద ఖచ్చితమైన సమాచారం ఉందని ఉద్ఘాటించారు.
The team of 418 expressed happiness over the response to the film, with producers Naveen…
గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పోలీస్ ఉన్నతాధికారిగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వర రావు (ఏబీవీ), 5 ఏళ్ళు జగన్ ప్రభుత్వం…