Telugu

‘హంసల దీవి’ ఇంత అందంగా ఉంటుందా!

సముద్రానికి – కృష్ణానది సంగమానికి నిలయమైన హంసలదీవి ప్రాంతం జిల్లాలోని చుట్టుప్రక్కన ప్రాంతాల వారికే ఎక్కువగా పరిచయం. కానీ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన “జయ జానకి నాయక” సినిమా విడుదలైన తర్వాత… ‘హంసలదీవి ఇంత అందంగా ఉంటుందా’ అనిపించేలా చూపించారు. ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఇక్కడ షూటింగ్ జరుపుకోకపోవడంతో, హంసలదీవిని సినిమాలో చూసిన వారందరికీ చాలా ఫ్రెష్ ఫీలింగ్ కలిగింది.

ADVERTISEMENT

ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు శ్లోకం ద్వారా ప్రారంభమైన విజువల్స్ లో… తొలుత నదీ సంగమ ప్రాంతాన్ని బోయపాటి అద్భుతంగా చూపించారు. బహుశా డ్రోన్ కెమెరాతో దీన్ని షూట్ చేసారో ఏమో గానీ, ఆ విజువల్స్ లోనే అద్భుతమైన ఫైట్ ను చిత్రీకరించారు. సెకండాఫ్ లో హైలైట్స్ గా నిలిచిన సన్నివేశాలలో ప్రధానంగా నిలిచిన ఈ ఫైట్ లో ‘బాహుబలి’ మాదిరి రౌడీ తలకాయ నరికివేసే సన్నివేశం ఉండడం విశేషం.

ఈ సన్నివేశానికి ఒక్క ప్రేక్షకులే కాదు, రాజకీయ నాయకులు కూడా ఫిదా అయ్యారన్న విషయం బయటకు వచ్చింది. “పవిత్ర సాగర సంగమ క్షేత్రాన్ని బోయపాటి శ్రీను అద్భుతంగా తెరకెక్కించారని, ఈ సినిమా ద్వారా దివిసీమకు మరింత ప్రాచుర్యం కలుగుతుందని, దివిసీమ విశిష్టతను ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసే అవకాశం లభించిందని” ఏపీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు.

Share
Vishnu Aadi

Vishnu is the Head of Daily Operations at M9 News, where he coordinates the writing team, publishers, and management. With a strong focus on ensuring smooth workflow and seamless collaboration, Vishnu plays a key role…

Published by

Recent Posts

Team India’s Chief Selector Out? BCCI’s Big 2027 Plan!

Ajit Agarkar’s future as India’s chief selector could be heading for another turn. His current…

8 minutes ago

JSP Jai Kottu: Youth Energy At Its Peak!

One of the main advantages for Pawan Kalyan, from the early stages of political career…

26 minutes ago