Telugu

‘బ్రహ్మోత్సవం’పై నేషనల్ మీడియాలో మహేష్ ఇంటర్వ్యూ!

తెలుగు హీరో అయినప్పటికీ, ప్రిన్స్ మహేష్ బాబు అంటే దాదాపుగా దేశవ్యాప్తంగా పరిచయం ఉన్న పేరే. జాతీయంగా ఎలాంటి సెలబ్రిటీ సర్వేలు జరిగినా… అందులో దక్షిణాది నుండి మహేష్ బాబు పేరు రావడం చాలా కామన్ గా జరిగే విషయం. అలాంటి ప్రిన్స్ తో ప్రముఖ ఎన్డీటీవీ “బ్రహ్మోత్సవం” సినిమాపై చిట్ చాట్ ప్రశ్నలను సంధించింది.

“బ్రహ్మోత్సవం” అనే కధ కుటుంబ ప్రధానంగా సాగుతుందని, అన్ని తరాలకు చెందిన జనాల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో అన్న దానికి నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. ఈ సినిమాలో రోల్ గురించి ‘ఛాలెంజింగ్’ అనే పదం తప్పని, కధ వినే సమయంలో తనకు ‘ఎక్సైట్ మెంట్’గా అనిపించాలని, ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో పాత్ర ఇప్పటివరకు నేను పోషించనిదని చెప్పిన ప్రిన్స్, ఈ సినిమా విడుదల తేదీని మాత్రం ఆడియో రిలీజ్ రోజున ప్రకటిస్తారని తెలిపారు.

ADVERTISEMENT

‘గత ఏడాది విడుదలైన ‘శ్రీమంతుడు’ సినిమా తన ఆలోచనలకు దగ్గరగా ఉంటుందని, తన ప్రొడక్షన్ యూనిట్ లో మొదటి సినిమా, అన్నింటికీ మించి బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించినందుకు సంతోషంగా ఉందని, సినిమాలు ఫ్లాప్ అయితే చాలా వ్యక్తిగతంగా తీసుకుంటానని, సినిమాల్లో నటించడం తప్ప తానూ మరొకటి ఆలోచించలేదని… తన అనుభవాలను పంచుకున్నారు ప్రిన్స్.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Bethlehem Kudumba Unit: Mallu Blockbuster, Telugu Flop?

Malayalam film Bethlehem Kudumba Unit starring Nivin Pauly and Mamitha Baiju in the lead roles…

24 minutes ago

ట్రంప్‌కి ఇంట్లో ఈగల మోత.. కానీ బయట పల్లకీ మోత లేదే!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ పది రోజుల్లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపడం సంగతి దేవుడెరుగు కనీసం తాను స్వయంగా ఇరాన్‌తో…

51 minutes ago