
“ఉమ్మడి కుటుంబానికి చెందిన మహేష్ ఫ్యామిలీ ఎలాంటి కలతలు లేకుండా చాలా సంతోషంగా జీవిస్తున్న తరుణంలో సడెన్‌గా మహేష్ తండ్రి చనిపోతాడు. తండ్రి అస్తికలను కాశీలో కలిపేందుకు బయలుదేరిన మహేష్‌కు రైలులో హీరోయిన్ సమంత పరిచయం కావడం, తొలి చూపులోనే మహేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకోమని వెంటపడుతుంది.
సమంత ప్రేమను తిరస్కరించిన మహేష్, గతంలోనే తన తండ్రి స్నేహితుడి కుమార్తె, ఎన్నారై అయిన కాజల్‌ను ప్రేమించినట్టు చెపుతాడు. అయితే కాశీ నుంచి వచ్చాక మహేష్ మదిలో సమంత జ్ఞాపకాలు మెదులుతుంటాయి. దీంతో తన మనస్సులో మెదిలే సమంతను పెళ్లి చేసుకోవాలా లేదా తాను గతంలో ప్రేమించిన కాజల్‌ను పెళ్లి చేసుకోవాలా అనే డైలామాలో ఉన్న సమయంలో మహేష్‌కు పెద్ద షాక్ తగులుతుంది.
మహేష్ తండ్రి చివరి కోరిక ప్రకారం మరదలు ప్రణీతను పెళ్లి చేసుకోవాలన్న కండీషన్ పెడతారు. చివరకు మహేష్ తండ్రి చివరి కోరిక ప్రకారం మరదలు ప్రణీతను పెళ్లి చేసుకున్నాడా లేదా తనను ప్రేమిస్తున్న సమంతను పెళ్లి చేసుకున్నాడా లేదా తాను ప్రేమించిన కాజల్‌ను పెళ్లి చేసుకున్నాడా? అన్నదే “బ్రహ్మోత్సవం” స్టోరీ. ఎలా ఉంది అబ్బాయిలు ఈ కధ. ఇంతకీ ఇది నిజమో కాదో గానీ… పెద్ద సినిమాల విడుదలకు ముందు ఇలాంటి కధలు సందడి చేయడం షరామామూలే.
The results of the 2026 Telugu Film Producers Council elections are out, with the C…
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో సి.కల్యాణ్ నేతృత్వంలోని ‘మన ప్యానెల్’ స్పష్టమైన ఆధిపత్యం చూపించింది. అధ్యక్షుడిగా సి.కల్యాణ్ ముందుగానే…