
YS Jagan's voting decision draws criticism
ఓటు ఒక దేశ భవిష్యత్, ఓటు ఒక నాయకుడి మీద నమ్మకం, ఓటు ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు…ఆ హక్కును వినియోగించుకోవడం దేశ పౌరుడిగా అందరి బాధ్యత. ముఖ్యంగా రాజకీయాలలో ఉండే వారికి దాని విలువ మరింత తెలిసుండాలి.
రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజలు స్వచ్చందంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ప్రభుత్వ, ప్రవైట్ రంగ సంస్థలు సైతం ఎన్నికల పోలింగ్ రోజు సెలవు దినంగా ప్రకటిస్తాయి. రాజ్యాంగంలో అంతటి గౌరవ స్థానంలో ఉన్న ఓటు ను వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్వచ్ఛందంగా దుర్వినియోగం చేసుకున్నారు.
తాజాగా ఏపీలో జరిగిన స్థానిక ఎన్నికలకు గాను తన ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం చొక్కా మడతపెడతా అంటూ బెంగళూర్ నుంచి పులివెందుల వచ్చిన జగన్, తన పార్టీ శ్రేణులను వెనకేసుకొని పోలింగ్ బూత్ కి వచ్చి మరి ఓటు వేయకుండా వెనుతిరిగారు.
ఒక పార్టీ అధినేతగా ఉంటూ, ఒక మాజీ ముఖ్యమంత్రిగా పని చేసి ఇలా ఓటు హక్కును దుర్వినియోగం చేయడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలింగ్ బూత్ లో తమ పార్టీ ఏజెంట్లు లేరని, అధికార పార్టీ అరాచకాలకు పాల్పడుతుందని, అధికారులు ప్రభుత్వానికి సహకరిస్తున్నారని…ఇలాంటి కుంటి సాకులు ఎన్ని చెప్పినా ఓటు వేయకుండా జగన్ వెనుతిరగడం ముమ్మాటికీ అప్రజాస్వామ్యమే అంటున్నారు టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్ర.
సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఓటమికి ఈవీఎం లను సాకులు చూపిన జగన్ పార్టీ ఘోర ఓటమి బాధ్యత నుంచి తప్పుకున్నారని, తాజాగా బ్యాలెట్ ఓటింగ్ ద్వారా జరిగే ఎన్నికలలో కనీసం ఓటు హక్కు కూడా వినియోగించుకోకుండా వెనక్కి వెళ్లడం ఆయనకు ప్రజాస్వామ్యం మీద ఉన్న గౌరవానికి నిదర్శనమంటూ ఎద్దేవా చేసారు.
తానూ టికెట్ ఇచ్చిన తన పార్టీ అభ్యర్థి, స్వయానా సొంత పిన్ని కి కూడా ఓటు వేయకుండా వెనుతిరిగిన మొదటి రాజకీయ నాయకుడిగా జగన్ చరిత్రలో నిలిచిపోతాడంటూ ధూళిపాళ్ల జగన్ పై విరుచుకుపడ్డారు. ఒక పార్టీ అధినేతగా జగన్ ఇటువంటి అప్రజాస్వామ్య పనులు చేస్తూ రాష్ట్ర ప్రజలకు ఎం సందేశం ఇస్తున్నట్టు.?
2019 ఎన్నికలలో కూడా ఓటర్లు ఇలానే ఏవేవో కుంటి సాకులు చెప్పి పోలింగ్ బూత్ ల వద్దకు రాకుంటే జగన్ కు ఆ ఒక్క ఛాన్స్ అవకాశం వచ్చేదా.? జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో కూర్చునేవారేనా.? ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా.? అనే సామెత కు జగన్ అర్ధం తెలుసుకోవాలని ప్రజాస్వామ్యవాదులు భావిస్తున్నారు.
SS Rajamouli is known for changing the rules of Indian cinema, both in filmmaking and…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో విజయవాడ రాజకీయాలకు ఎప్పుడు ఒక ప్రత్యేక స్థానమే ఉంటుంది. ఇక్కడి ఓటర్లలో రాజకీయ చైతన్యం ఎక్కువ. తమ…