
ఈమధ్యకాలంలో ట్రోల్స్ కి స్కోప్ లేకుండా ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేసిన ఏకైక దర్శకుడు బుచ్చి బాబు అని చెప్పొచ్చు. అపారమైన అనుభవమున్న బడా దర్శకులే ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయలేక, ట్రోలర్స్ కి దొరికిపోతున్న ఈ తరుణంలో.. “పెద్ది” సినిమా విషయంలో ఇప్పటివరకు విడుదలైన ప్రతీ కంటెంట్ తో మెగా అభిమానుల్ని మాత్రమే కాక, సదరు సినిమా ప్రేక్షకుల్ని కూడా అలరించాడు బుచ్చిబాబు. అటువంటి బుచ్చిబాబుని కొందరు సోషల్ మీడియా పక్షులు ఒక విషయంలో మాత్రం కాస్త గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు. అదే.. బుచ్చిబాబు ‘వినయం’.
వినయంగా మెచ్చుకోవాల్సింది పోయి ట్రోల్ చేయడం ఏంటా అని కొందరు ముక్కున వేలేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. తన మొదటి సినిమా “ఉప్పెన” టైమ్ నుండి కూడా బుచ్చిబాబు ఎక్కడ కనిపించినా రెండు చేతులు కట్టుకుని తల దించుకుని నిలబడడం, సీనియర్లతో మాత్రమే కాక తన తోటి దర్శకులతో కూడా అదే రీతిలో వ్యవహరించడం అనేది డిస్కషన్ టాపిక్ అయ్యింది.
అయితే.. రీసెంట్ గా “ఉస్తాద్ భగత్ సింగ్” ప్రీరిలీజ్ ఈవెంట్లో బుచ్చిబాబు ఏకంగా హరీష్ శంకర్ కాళ్లకు నమస్కరించబోగా, హరీష్ శంకర్ వెనక్కి తప్పుకొని, బుచ్చిబాబుని దగ్గరకి తీసుకోవడం బాగా వైరల్ అయ్యింది. ఎంత సీనియర్ అయినా మరీ కాళ్ల మీద పడాల్సిన అవసరం ఏముందని కొందరు వ్యాఖ్యానించారు. ఇక కొందరు రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే.. స్టార్ హీరో దర్శకుడు అయ్యుండి, ఇలా అతి వినయం ప్రదర్శిస్తూ కాళ్ల మీద పడడం ఏంటి అని సోషల్ మీడియా సాక్షిగా ప్రశ్నించారు కూడా.
అయితే.. వ్యక్తిగా బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నప్పటి నుండి ఇదే తీరుగా వ్యవహరిస్తున్నాడు. “నాన్నకు ప్రేమతో, రంగస్థలం” మేకింగ్ వీడియోలు, ప్రీరిలీజ్ ఈవెంట్లు చూసిన ఆ విషయం అందరికీ అర్థమవుతుంది. అలాంటిది ఇప్పుడు అతను ఓ పెద్ద సినిమా తీస్తున్నాడు కాబట్టి అతడి క్యారెక్టర్ ట్రైట్ అయినటువంటి వినయాన్ని పక్కన పెట్టమనడం సమంజసం కాదు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఫ్యాన్స్ కాస్త అర్థం చేసుకుని, బుచ్చిబాబు వినయాన్ని బూతద్దంలో చూసి అతి వినయంగా చిత్రీకరించడం మానేయాలి.
India's 351/7 looked like a strong enough total, but the third ODI against West Indies…
Legendary filmmaker Singeetham Srinivasa Rao has passed away at Kauvery Hospital in Chennai following ill…