
జనవరిలో రిలీజ్ అవ్వాల్సిన రజినీకాంత్ 2.0 చిత్రం వాయిదా పడింది. ఏప్రిల్ లో చిత్రం రిలీజ్ అవుతుందని నిర్మాతలు ప్రకటించారు. ఏప్రిల్ 27న చిత్రం విడుదల కాబోతుందని తమిళ సినీ వర్గాల సమాచారం. దీనితో అల్లు అర్జున్ ‘ నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ మరియు మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ నిర్మాతలు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.
గతంలో ఇదే రోజున వస్తున్నట్టు ముందు నా పేరు సూర్య టీం తరువాత భరత్ అనే నేను టీం ప్రకటించారు. ఎవరు రావాలా అని వారిలో వారే మల్లగుల్లాలు పడుతుండగా రజినీకాంత్ పిడుగు పడేసాడు. అయితే దీనిని అంత తేలికగా వదలకూడదని, ఇరు పక్షాలు నిర్ణయించారు. ఈ విషయాన్నీ ఫిలిం ఛాంబర్ లోనే తేల్చుకుంటాం అని నా పేరు సూర్య నిర్మాత బన్నీ వాస్ తెలిపారు.
నేను భరత్ అనే నేను నిర్మాత దానయ్య కలిసి మాట్లాడుకుని ముందుకు వెళ్తాము అని బన్నీ వాస్ తెలిపారు. 2.0 చిత్రంపై తమకు గౌరవం ఉన్న వారి రిలీజ్ డేట్ మెరుపులు ఇక్కడి సినిమాలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి అనేది బన్నీ వాస్ అభియోగం. చూడాలి ఈ గొడవ ఎక్కడి దాకా వెళ్తుందో!
A birthday celebration has turned into an official casting update for Ram Pothineni’s #RAPO23. The…
Thrigun Eashwaran is one reason many audiences are watching this year's Bigg Boss season. However,…