Telugu

బాల్ ట్యాంపరింగ్ లో… మనోడు ఎక్స్ పర్ట్..!

కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఆసీస్ ఆటగాడు కేమరాన్ బాన్‌క్రాఫ్ట్ తక్కువోడేమీ కాదని తాజాగా చక్కర్లు కొడుతున్న మరో వీడియో బయటపెట్టింది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లోనూ మనోడు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన విషయం ఇప్పుడు వైరల్ అయింది.

ADVERTISEMENT

సిడ్నీలో జరిగిన ఐదో టెస్టులో బ్రేక్ అనంతరం ఆటగాళ్లంతా మైదానంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంటే బాన్‌క్రాఫ్ట్ మాత్రం ఓ చెంచా చక్కెర తీసుకుని తన జేబులో వేసుకున్నాడు. ఈ చక్కెరతో అతడు బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్టు చెబుతున్నారు. ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

బంతి రూపాన్ని మార్చేందుకే అతడు చక్కెరను జేబులో వేసుకున్నాడని చెబుతున్నారు. తాజా బాల్‌ ట్యాంపరింగ్ ఘటనపై విచారణ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) హెడ్ లియాన్ రాయ్ ఆధ్వర్యంలోని దర్యాప్తు బృందం దక్షిణాఫ్రికా బయలుదేరింది. విచారణ అనంతరం కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లపై జీవిత కాల నిషేధం విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Varanasi: Play Safe or Go Global Early?

An early premiere can bring a film international attention even before its theatrical release. But…

9 minutes ago

Dhurandhar Sweeps IIFA 2026

Dhurandhar has emerged as the biggest winner at the IIFA Awards 2026. Dhurandhar has taken…

24 minutes ago