
మారుతున్న కాలానుగుణంగా చిన్న బడ్జెట్ సినిమాలకు ఊతమివ్వాలనే ఉద్దేశంతో బన్నీ వాస్ కి బాధ్యతలు అప్పజెప్పి గీతా ఆర్ట్స్ 2 మొదలుపెట్టారు. కేవలం వైవిధ్యం ఉన్న వాటికే అగ్ర తాంబూలం ఇస్తామని చిన్నా పెద్దా తేడా లేకుండా కథకు తగ్గట్టు ఎంపిక ఉంటుందని అరవింద్ తొలినాళ్ళలోనే చెప్పారు. దానికి తగ్గట్టే భలే భలే మగాడివోయ్ అద్భుతమైన ఫలితాన్ని అందుకుంది. ఇప్పటికీ నాని కెరీర్ బెస్ట్ కంటెంట్ అండ్ కలెక్షన్ పరంగా దీనిదే మొదటి స్థానం. కన్నడ రీమేక్ కూడా గీతా 2నే చేసింది. ఆ తర్వాత గీత గోవిందంది మరో చరిత్ర. అర్జున్ రెడ్డి ఇమేజ్ ని క్రాస్ ఓవర్ చేస్తూ విజయ్ దేవరకొండకు ఫ్యామిలీ ఆడియన్స్ ని దగ్గర చేసింది.
గీతా ఆర్ట్స్ 2 పేరు మరింత బలపడింది దీని నుంచే. ఆ తర్వాత చేసిన టాక్సీ వాలా విడుదలకు ముందే పైరసీ రూపంలో నానా కష్టాలు పడినా చివరికి జరిగిన థియేట్రికల్ బిజినెస్ కి న్యాయం చేకూరుస్తూ హిట్టు కొట్టింది. తండ్రి చావు మీద కామెడీ పండించారనే కామెంట్స్ ఎన్ని వచ్చినా ప్రతి రోజు పండగ కూడా సక్సెస్ ఫుల్ మూవీనే. ఇక్కడి దాకా ప్రయాణం చక్కగానే సాగుతూ వచ్చింది. ఎక్కడ పొరపాటు జరుగుతోందో కానీ ట్రాక్ తప్పడం మొదలైంది. ఆరెక్స్ 100 ఫేమ్ కార్తికేయతో చేసిన చావు కబురు చల్లగా మొదటి చావు దెబ్బ కొట్టింది. ఇంత బి గ్రేడ్ లవ్ స్టోరీ పేరుతో ఎలా ఓకే చేశారనే కామెంట్స్ ఇండస్ట్రీలోనే వినిపించాయి. రిజల్ట్ కూడా అలాగే వచ్చింది.
అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గట్టెక్కింది కానీ అందులో ఉన్నది కూడా రొటీన్ ప్రేమకథే. కాకపోతే ఎంటర్ టైన్మెంట్, పూజా హెగ్డేతో కెమిస్ట్రీ, పాటలు రక్షించాయి. పక్కా కమర్షియల్ తో పూర్తిగా మూసలోకి వెళ్లిపోయే చేసిన ప్రయత్నం అసలుకే మోసం తెచ్చి బెడిసి కొట్టింది. ఇంత రొట్ట సబ్జెక్టులను జడ్జ్ చేయడంలో అరవింద్ ఎక్కడో లెక్క తప్పారు. కట్ చేస్తే ఊర్వశి రాక్షసివోకి యూత్ సపోర్ట్ దక్కినా డోస్ పెంచిన రొమాన్స్ ఫ్యామిలీస్ ని దూరం చేసింది. ఫలితం ఫ్లాప్. మళ్ళీ తమ సిద్ధాంతానికే కట్టుబడ్డామని రుజువు చేసే బాధ్యత గీతా ఆర్ట్స్ 2 ఇప్పుడు 18 పేజెస్ మీద పెట్టింది. ట్రైలర్, కాన్సెప్ట్ గట్రా చాలా డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టే కంటెంట్ ఉంటే కనక అరవింద్ గారన్నట్టు విలక్షణనను ఇకపై నిలబెట్టుకోవచ్చు.
The fifth T20I between India and West Indies was washed out due to rain at…
Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…