జగన్ మెడకు చుట్టుకుంటున్న మరిన్ని కేసులు!

ఇప్పటికే అక్రమాస్తుల వ్యవహారంలో లెక్కకు మించిన కేసులను ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అనే పేరు తాజాగా మరిన్ని కేసులకు వేదిక అవుతోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో టీడీపీ నేతలు భూదందాకు పాల్పడుతున్నారంటూ జగన్ కుటుంబం ఆధ్వర్యంలోని ‘సాక్షి’ దినపత్రిక ప్రధాన శీర్షికన కథనాన్ని ప్రామాణికంగా తీసుకుని, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పొన్నూరు పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ADVERTISEMENT

ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వైఎస్ జగన్ పై మరో కేసు నమోదు చేశారు. పొలిటికల్ మెంటార్ ఆఫ్ జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్ హోదాలో జగన్ పై కేసు నమోదు చేసిన పోలీసులు, జగతి పబ్లికేషన్స్ చైర్ పర్సన్ హోదాలో ఉన్న జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డిపైనా కేసు నమోదు చేశారు. ఇక ‘సాక్షి’ పత్రిక పబ్లిషర్ హోదాలో ఉన్న సీనియర్ జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి, ఎడిటర్ వి.మురళి, జగతి పబ్లికేషన్ డైరెక్టర్లు హన్నప్పనహల్లి వీరన్న ఈశ్వరయ్య, వై.ఈశ్వరప్రసాద్ రెడ్డి, వి.శ్రీధర్ రెడ్డి, రాజప్రసాదరెడ్డి, పీవీకే ప్రసాద్, ప్రకాశరావు అంతుర్ నారాయణ్, ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ డైరెక్టర్లు ఎల్.బలరాంరెడ్డి, వీర్మణి బాలరాజు, బండి రాణిరెడ్డి తదితరులపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు.

Share
Published by

Recent Posts

చొక్కా మడత పెట్టడం అంటే ఓటు వేయకపోవడమేనా.?

ఓటు ఒక దేశ భవిష్యత్, ఓటు ఒక నాయకుడి మీద నమ్మకం, ఓటు ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు...ఆ హక్కును వినియోగించుకోవడం…

51 seconds ago

Rajamouli’s Master Plan for Varanasi OTT: Will It Work?

SS Rajamouli is known for changing the rules of Indian cinema, both in filmmaking and…

13 minutes ago