
రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం ప్రజల సెంటిమెంట్ గా మారడం, రాజీపడబోమని చంద్రబాబు చెప్పడం, హోదా ఇవ్వకపోవడంపై వివిధ వర్గాల నుంచి వస్తున్న నిరసనలతో మెట్టు దిగిన కేంద్రం రాష్ట్రంపై దృష్టి సారించి వరుస భేటీలు జరిపి ఈ ప్రతిపాదనలను తయారు చేసింది. మరొక ముఖ్య విషయమేమిటంటే… “1 + 1” ఆఫర్ తరహాలో ‘ప్రత్యేక హోదా’తో పాటు ‘రైల్వే జోన్’పై కూడా ఓ సానుకూలంగా కీలక ప్రకటన రానుందని సమాచారం లభిస్తోంది.
వీటితో పాటు హామీల అమలు దిశగా చేయాల్సిన కార్యక్రమాలు, మరిన్ని విద్యాసంస్థలు, పారిశ్రామిక రాయితీలు తదితర అంశాలను పొందుపరిచినట్టు తెలుస్తోంది. హోదా ఇస్తే కలిగే రాయితీల ప్రయోజనాలను విడిగా ఇస్తామని వివరణాత్మకంగా చెబుతూ, ఆర్థిక, మౌలిక వసతుల కల్పనకు, పోలవరం, అమరావతి నిర్మాణానికి నిధులు గురించిన సమాచారం కూడా ఈ ముసాయిదాలో ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Dulquer Salmaan’s I’m Game has not found the expected traction in the Telugu states. The…
Rashmika Mandanna, who recently took a break from work after suffering a hip injury, has…