
ఎన్నికల ఫలితాలు వచ్చిన సాయంత్రం నుండే టీవీలకు ఎక్కి టీడీపీ ఓటమిని అవహేళన చెయ్యడం ప్రజలకు విస్మయం కలిగించింది. వారు అంతటితో ఆగకుండా టీడీపీ రాష్ట్రంలో కనుమరుగవుతుందని ఆ చోటు తాము ఆక్రమిస్తామని జబ్బలు చరుస్తున్నాడు. ఇదంతా పార్టీ విస్తరణకు 1% శ్రమ కూడా పడకుండానే. మంత్రివర్గంలో రాష్ట్రాన్ని పూర్తిగా వదిలేసిన ఏ మాత్రం నామోషీగా ఫీల్ కాకుండా కేంద్రంలో కొత్తగా నియమింపబడ్డ మంత్రుల దగ్గరకు శాలువాలు, బొక్కేలతో వెళ్ళి వాళ్ళను ప్రసన్నం చేసుకునే పనిలో ఉంటున్నారు.
కేంద్ర మంత్రివర్గంలో తనకు స్థానం రావడాన్ని ఆంధ్రప్రదేశ్ కోటాగానే భావించాలని రాష్ట్ర భాజపా నేతలతో కేంద్ర పార్లమెంటరీ, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ అన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ గా ఉండటంతో ఆ విధంగా వారిని ఓదార్చారట. చివరికి రాష్ట్ర బీజేపీ నాయకులు రాష్ట్రానికి ఇటువంటి దుస్థితి కలిగించారు. మరోవైపు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసిన రాష్ట్ర భాజపా నేతలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ఉండటం విశేషం.
Hai Jawani Toh Ishq Hona Hai, starring Varun Dhawan, Pooja Hegde, and Mrunal Thakur, has…
CM Vijay is proving that "elevation" isn’t just about winning elections; it’s about how you…