
‘‘ఆ ఫిర్యాదు మీరే చేశారా? లేదా అనేది ధ్రువీకరించండి. మీ ఆరోపణలకు ఆధారాలు నిరూపిస్తారా? దర్యాప్తు అధికారికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారా?’’ అని లేఖ ద్వారా కోరింది. ఆరోపణలు రుజువు చేయలేని పక్షంలో నిబంధనల ప్రకారం ప్రాసిక్యూట్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. 15 రోజుల్లో పుల్లారావు ప్రతిస్పందన తెలియజేయాలని అనంతరం కేంద్ర మంత్రిత్వశాఖకు పంపుతామని తెలిపింది. లేదంటే ఫిర్యాదును విస్మరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
పెంటపాటి పుల్లారావు గతంలో పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గ్రీన్ ట్రిబ్యునల్ లో అనేక కేసులు వేసిన సంగతి తెలిసిందే. మీడియాలో జనసేనకు అనుకూలంగా వ్యాసాలు రాస్తున్న ఆయనను పవన్ కళ్యాణ్ అప్పట్లో పార్టీలోకి ఆహ్వానించారు. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారు అయితే ఆయనకు ఎన్నికలలో డిపాజిట్ కూడా దక్కలేదు. ఇది ఇలా ఉండగా కేంద్రం నుండి వచ్చిన లేఖకు పుల్లారావు స్పందిస్తూ… ఫిర్యాదు చేసింది తానేనని పేర్కొంటూ తిరుగు లేఖ రాసినట్లు తెలిపారు.
Namit Malhotra’s Ramayana has crossed $517K in US premiere advance sales, but the numbers reveal…
భోగాపురం విమానాశ్రయానికి ఎప్పుడో ప్రారంభోత్సవం జరిగింది కదా? మళ్ళీ కొత్తగా ఈ ప్రారంభోత్సవం ఏమిటి? అనే సందేహం కలుగవచ్చు. భోగాపురం…