Telugu

ప్యాన్ ఇండియా ప్రయాణంలో కుర్ర హీరోకు సవాళ్లు

ఎలాంటి స్టార్ బ్యాక్ గ్రౌండ్ లేని కుర్ర హీరోలు పెద్ద స్థాయిని అందుకోవాలంటే చాలా కష్టపడాలి. అక్కడిదాకా చేరుకున్నాక దాన్ని నిలబెట్టుకోవడం ఇంకో పెద్ద సవాల్. హ్యాపీ డేస్, యువత లాంటి చిన్న సినిమాలతో కెరీర్ మొదలుపెట్టి, మెల్లగా అడుగులు వేసుకుంటూ వచ్చిన నిఖిల్ కి కార్తికేయ 2 నుంచి ప్యాన్ ఇండియా ప్రయాణం మొదలైంది.

మాములుగా టాలీవుడ్ స్టార్లను నార్త్ ఆడియన్స్ థియేటర్లలో ఆదరించిన దాఖలాలు తక్కువ. యూట్యూబ్ లో వందల మిలియన్లు కురిపిస్తారు కానీ టికెట్లు కొనమంటే మాత్రం ససేమిరా అంటారు. బాహుబలితో ప్రభాస్, పుష్పతో అల్లు అర్జున్ దీన్ని బ్రేక్ చేశారు. అదృష్టవశాత్తు నిఖిల్ కూడా ఈ గుర్తింపు తెచ్చుకున్నాడు. కార్తికేయ 2 ఇచ్చిన సక్సెస్ వల్ల ఖాన్ల అధిపత్యపు బాలీవుడ్ లో చిన్న ముద్ర వేశాడు.

ADVERTISEMENT

అయితే ఇక్కడితో కథ అయిపోలేదు. అసలు ప్రయాణం మొదలైంది. స్పై మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే అది కాస్తా నిరాశపరిచే దిశగానే వెళ్తోంది. సుభాష్ చంద్రబోస్ ఎలిమెంట్ ని పబ్లిసిటీ కోసం వాడిన వైనం ఆడియన్స్ కి నచ్చలేదు. ఫేక్ ప్రాపగండా అని అర్థమైపోయింది. కంటెంట్ కూడా వీక్ ఉండటంతో దెబ్బ తప్పలేదు.

నిఖిల్ ఇకపై అసలైన ముళ్ళను కాచుకోవాల్సి ఉంటుంది. చాలా క్రేజీ ప్రాజెక్టులు చేతిలో పడ్డాయి. రామ్ చరణ్ నిర్మాతగా ది ఇండియా హౌస్ ప్రకటన స్టేజి నుంచే వివాదాలతో ఆసక్తి రేపింది. స్వయంభు పోస్టర్లు కంటెంట్ మీద హైప్ ని పెంచాయి. వైవిధ్యమైన కథలను ఎన్ని ఎంచుకుంటున్నా వాటి సక్సెస్ ల మీదే నిఖిల్ కెరీర్ ఆధారపడి ఉంటుంది.

సబ్జెక్టుల పట్ల ఎగ్జైట్ మెంట్ కలిగితే సరిపోదు. వాటిని సరిగ్గా బేరీజు వేసుకునే మెచ్యూరిటీ పెంచుకోవాలి. కాంబినేషన్లు ఓపెనింగ్స్ తెస్తాయేమో కానీ అవి బ్లాక్ బస్టర్స్ గా మారాలంటే మాత్రం కంటెంట్ మాట్లాడాల్సిందే. అసలే ఒకడు ఎదుగుతుంటే ఎలా కిందకు లాగాలా అని చూసే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అలెర్ట్ గా ఉండటం అవసరం.

కార్తికేయ 2 విడుదల సమయంలోనూ నిఖిల్ టీమ్ పడిన యాతన మర్చిపోయేది కాదు. స్పై కూడా నిర్మాత ఒత్తిడి వల్ల తక్కువ గ్యాప్ లో రిలీజ్ కు ఒప్పుకోవాల్సి వచ్చింది కానీ తగినంత సమయం ఉంటే ఏమైనా రిపేర్లు జరిగేవేమో. నాని, విజయ్ దేవరకొండ లాంటి టూ టైర్ గ్యారెంటీ లీగ్ లోకి ప్రవేశించడానికి నిఖిల్ హార్డ్ వర్క్ ఒకటే చేస్తే సరిపోదు. స్మార్ట్ థింకింగ్ కావాలి. కఠిన నిర్ణయాలకు సై అనాలి. పువ్వుల్లో వచ్చిన ప్యాన్ ఇండియా మార్కెట్ కింద ముళ్ళు ఉన్న సంగతి గుర్తించి జాగ్రత్తగా ఉండాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ఖైరతాబాద్ లో కవిత వెనుకున్న ఆ రాజకీయ బలం ఎవరు.?

ఖైరతాబాద్ ఉపఎన్నికలలో తెలంగాణ రక్షణ సేన తరుపున ఒక బలమైన అభ్యర్థిని నిలబెడతాం అంటూ కవిత చాల కాన్ఫిడెంట్ గా…

30 seconds ago

Kappi Squad Review: Average but Watchable Urban Comedy

BOTTOM LINE Average but Watchable Urban Comedy PLATFORM JioHotstar RUNTIME 1 Hour 73 Mins (4…

7 minutes ago