
ఇలా ఎన్ని కారణాలు చెప్పినప్పటికీ, అభివృద్ధికి సంబంధించి మొదటి జవాబుదారుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి 17 నెలలుగా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్న చంద్రబాబు, ఈ ఏడాదిలో శంకుస్థాపనల ద్వారా వాటికి ముహూర్తాలు పెట్టారు. ఇటీవల జరిగిన అమరావతి శంకుస్థాపన మొదలు నేడు చేసిన దుర్గ గుడి, బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ల వరకు అంతా సజావుగా నిర్వహించారు. అయితే తలపెట్టిన కార్యక్రమాలన్ని అమలు చేయాల్సిన సంవత్సరంగా 2016 మారింది.
ఓ రకంగా 2016వ సంవత్సరం చంద్రబాబు పాలన పట్ల ప్రజల్లో విశ్వాసం పెంచేదిగా మారుతుందా? లేక ఉన్న విశ్వాసాన్ని తగ్గించేదిగా మారుతుందా? అన్న ఆసక్తి రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజల్లో కూడా వ్యక్తమవుతోంది. రాజధాని నిర్మాణంతో పాటు ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న పెట్టుబడుల కంపెనీలు కూడా 2016లోనే ప్రారంభానికి నోచుకున్నాయి.
ప్రస్తుత ప్రణాళికలన్నీ కార్యరూపం దాలిస్తే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎదురుండదన్న భావన కార్యకర్తల్లోనూ చంద్రబాబు నింపినవారవుతారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు తెలుగుదేశం పార్టీకి మరియు చంద్రబాబుకు 2016వ సంవత్సరం చాలా కీలకంగా మారనుంది.
Ranveer Singh’s look from his upcoming film Pralay has leaked online, and the actor’s new…
రాజకీయాలు ఎంతలా దిగజారిపోతున్నాయి అని చెప్పటానికి ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీల నాయకులు నువ్వా - నేనా అన్నట్టుగా పోటీపడుతున్నారు. నిన్న…