
KTR and Congress remarks spark debate
రాజకీయాలు ఎంతలా దిగజారిపోతున్నాయి అని చెప్పటానికి ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీల నాయకులు నువ్వా – నేనా అన్నట్టుగా పోటీపడుతున్నారు. నిన్న మొదలైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల రచ్చ లెవెల్ – 1 ని దాటుకుని ఇప్పుడు లెవెల్ -2 లోకి ఎంట్రీ ఇచ్చింది.
అటు నల్ల చొక్కాల నిరసనతో మొదలైన బిఆర్ఎస్ నాయకుల రచ్చ ఇప్పుడు నడిరోడ్డు మీద రాష్ట్ర ముఖ్యమంత్రిని బూతులు తిట్టే స్థాయికి చేరింది. ఇక ఇటు కేసీఆర్ ఎక్కడ అంటూ మొదలైన కాంగ్రెస్ శ్రేణుల నినాదాలు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి చావును కోరే వరకు వెళ్లాయి.
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని నడిరోడ్డు మీద పోలీసుల ఎదుట మీడియా సాక్షిగా చిల్లర…..అంటూ బూతులతో రెచ్చిపోయారు. కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడి అంటూ కాంగ్రెస్ నేతలు ఇచ్చిన పిలుపుకి ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్ ని మార్గమధ్యలో పోలీసులు అడ్డుకోవడంతో ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఈ విధంగా చిల్లర విమర్శలు చేస్తూ తన ‘సహనాన్ని’ కోల్పోయారు.
ఇక కాంగ్రెస్ నాయకులు నిన్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు స్పీకర్ ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలకు పార్టీ అధినేతగా కేసీఆర్ క్షమాపణ చెప్పాలంటూ కేసీఆర్ ఇంటి ముట్టడికి పిలుపిచ్చారు. దీనితో కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ వీరపల్లి మీడియా ముందుట కనీస ‘స్పృహ’ లేకుండా కేసీఆర్ చావును కోరుకుంటున్నాం అంటూ వ్యాఖ్యానించారు.
చావు డప్పులతో కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ ని ముట్టడిస్తాం, కేసీఆర్ చావుని కోరుకుంటున్నాం, కేసీఆర్ తెలంగాణకు పట్టిన పీడ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ చేసిన వ్యాఖ్యలు అత్యంత దిగజారుడు రాజకీయ విమర్శల జాబితాలోకి వస్తాయి. రాజకీయాలలో ఇటువంటి విమర్శలు రాజకీయ ఆత్మహత్యలే అవుతాయి అనే కనీస స్పృహ కూడా లేకుండా రాజకీయ నేతలు ఇలా ఎందుకు దిగజారిపోతున్నారు అనే ప్రశ్న నానాటికి బలపడుతుంది.
ఒకరి చావును కోరుకుంటూ రాజకీయం చేస్తాం అనడం, చావుల మీద రాజకీయం చెయ్యడం రాజకీయాలలో అత్యంత నీచ స్థాయి అనే చెప్పాలి. శంకర్ చేసిన ఈ వ్యాఖ్యలకు శంకర్ తో పాటుగా కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయంగా భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది.
2024 ఎన్నికలకు ముందు ఏపీ ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు చావు మీద కూడా అప్పటి అధికార వైసీపీ నాయకులు ఇలానే నోరుపారేసుకున్నారు, చివరికి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఘోర ఓటమిని ఎదుర్కొన్నారు.
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ని నీచంగా తూలనాడడం రాజకీయాలలో ఎంత తప్పో, అలాగే అధికార పార్టీలో ఉంటూ ప్రతిపక్ష నాయకుడి చావు కోరుకోవడం కూడా వీరపల్లి శంకర్ చేసిన తప్పుగా పరిగణించాలి. రాజకీయాలలో ఇటువంటి భాషను నిర్మించాల్సిన అవసరం ఎంతుందో అటువంటి రాజకీయ విమర్శలను కట్టడి చెయ్యాల్సిన ఆవశ్యత కూడా అంతే ఉంటుంది.
After being a relentless supporter for YS Jagan, all her life, Sharmila changed the track…
రాజకీయంలో పార్టీల మధ్య అంతర్గతంగా ఎం జరుగుతుంది.? ఎవరు త్వరలో ఏ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు అనేది లీకులు…