
వర్షపు నీటి భూగర్భ జలాలుగా మార్చాలని, అందరికీ నీటి భద్రత ఇవ్వాలని తన జీవితాశయంగా మార్చుకున్నానని చెప్పారు. 30 వేల చెక్ డ్యామ్ లలో పూడిక తీయాలని ఆదేశాలు జారీ చేశానని, మరో 20 వేల చెక్ డ్యామ్ లు నిర్మిస్తామని తెలిపారు. అనంతపురం జిల్లాలో లక్ష పంట కుంటలు తవ్వాలని, ఈ ఏడాది బీపీటీ, పేరూరు పనులు ప్రారంభిస్తామని, పోలవరం అసాధ్యమని చాలా మంది అన్నారని, మనిషి తలచుకుంటే ఏదైనా సాధ్యమేనని, 2018 నాటికి గ్రావిటీతో పోలవరం నుంచి నీళ్లిస్తామని చంద్రబాబు తెలిపారు.
నీరు-ప్రగతి ఉద్యమంపై 90 రోజుల పాటు ఆలోచించాలని, అనంతపురం జిల్లాలో 27 వేల హెక్టార్లకు బిందు సేద్యం సదుపాయం కల్పించామని, గ్రామాలు, పట్టణాల్లో వసతుల కల్పనకు అనేక కార్యక్రమాలు చేపట్టామని,యాభై శాతం రాయితీతో పశువుల దాణా ఇస్తున్నామని, జూన్ 2 లోపు ప్రతి ఇంటికీ వంట గ్యాస్ ఇప్పిస్తామని తెలిపారు. తాను నిరంతరం పని చేస్తానని, పనిలో తనకు విసుగుండదు, విరామం ఎప్పుడూ కోరుకోనని, అధికారులు, ప్రజా ప్రతినిధులు సహకరించకపోతే తనకు ఎస్ఎంఎస్ చేయాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
As we have already informed our readers, for the first time in Bigg Boss Telugu…
The municipal elections in Andhra Pradesh ended on November 1, but the political battle did…