
నారా లోకేష్ పాదయాత్రకి బయలుదేరుతున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు నివాసానికి భారీగా టిడిపి నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. వారి నినాదాలతో ఆ ప్రాంతమంతా చాలా కోలాహలంగా మారింది. వారందరితో కలిసి నారా లోకేష్ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని తాతగారికి నివాళులు అర్పించారు.
నారా లోకేష్ రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకొంటారు. శుక్రవారం ఉదయం కుప్పంలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత 4,000 కిమీ యువగళం పాదయాత్ర ప్రారంభిస్తారు. ఆదేరోజు సాయంత్రం కుప్పంలో భారీ బహిరంగసభ నిర్వహిస్తారు. మొత్తం 400 రోజులపాటు సాగే ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగుస్తుంది.
SS Rajamouli's Varanasi is one of the most ambitious projects in Indian cinema, with Mahesh…
The NDA alliance is facing growing discontent over seat sharing in Tiruvuru and Salur, with…