
అధికారంలోకి వచ్చి రెండేళ్లయిన నేపథ్యంలో చంద్రబాబు ప్రత్యేకంగా సర్వే చేయించారు. ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది? ఎమ్మెల్యేల పనితీరు ఏ మేరకు ఉంది? అన్న అంశాలపై ప్రధానంగా సాగిన ఈ సర్వే నివేదికను నిన్న చంద్రబాబుసమన్వయ కమిటీ భేటీలో అందరి ముందు పెట్టారు. దాదాపు 5 గంటల పాటు తన కేబినెట్ లోని మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు ఈ భేటీని నిర్వహించారు.
ప్రభుత్వ పనితీరుపై మెజారిటీ శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, సగానికి పైగా ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలు అసంతృప్తితోనే ఉన్నట్లు ఆ సర్వే నిగ్గు తేల్చింది. 30 నుంచి 35 శాతం మంది ఎమ్మెల్యేల తీరు పరవాలేదని… 25 నుంచి 30 శాతం మంది ఎమ్మెల్యేల పనితీరుతో సంతృప్తికరంగా లేమని… ఓ 10 శాతం మంది ఎమ్మెల్యేల పనితీరు అస్సలు ఏ మాత్రం బాగోలేదని ప్రజలు సదరు సర్వేలో తేల్చేసిట్లుగా సమాచారం.
రెండేళ్లవుతున్నా… ప్రభుత్వ పనితీరుకు అనుగుణంగా ఎమ్మెల్యేలు తమ పనితీరు మెరుగుపరచుకోకపోతే ఎలాగంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అంతే కాకుండా పనితీరు బాగోలేని ఎమ్మెల్యేలను సంస్కరించడమెలా? అన్న అంశంపైనా ఆ భేటీలో సుదీర్ఘ చర్చే నడిచింది. పలు అంశాలు చర్చకొచ్చినా… ఓ కమిటీ వేసి పనితీరు బాగోలేని ఎమ్మెల్యేల పనిబట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ ఏర్పాటుకు సమన్వయ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది.
పాత కాలం సినిమాలో హీరో, విలన్ మధ్య జరిగే రెండున్నర గంటల కథలో సినిమా కు శుభం కార్డు పడే…
Irumudi has completely changed Ravi Teja’s career equation. After a long run of bad films,…