
హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయ భవనాల స్థానంలో సాధ్యమైనంత త్వరగా కొత్త భవనాలను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు గవర్నర్ తెలిపిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించగా, తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై సభ్యులు కొన్ని సందేహాలను వ్యక్తం చేశారు. అపరిష్కృత అంశాలన్నింటిపైనా తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరపాలని పొలిట్ బ్యూరో సభ్యులు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాల్సిన అంశాలపై చర్చలు జరపడం ఉత్తమమన్న అభిప్రాయాన్ని పొలిట్ బ్యూరో వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా ప్రసంగించిన చంద్రబాబు… “మనం విద్యుత్ సరఫరా చేసినందుకు తెలంగాణ ప్రభుత్వం దాదాపు 4వేల కోట్ల బకాయిలు పడింది. వారు మనకు బొగ్గు సరఫరా చేసినందుకు తెలంగాణకు మనం 2వేల కోట్లు చెల్లించాలి. మనకు చెల్లించాల్సిన బకాయిల నుంచి వాటిని మినహాయించుకోమంటే వారు వినడం లేదు. బొగ్గు సరఫరా నిలిపివేశారు. మనం విద్యుత్ సరఫరా నిలిపివేశాం. కొన్ని విషయాల్లో ఇరు రాష్ట్రాల మధ్య ప్రతిష్ఠంభన ఉన్న మాట నిజమే. అయినా తెలంగాణతో సత్సంబంధాలు కొనసాగించడం అవసరం” అని సీఎం పేర్కొన్నారు.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…