
“దివ్య దర్శనం” పేరుతో పేదలను ఉచితంగా పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించని వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. తిరుమల – తిరుపతి, విజయవాడ దుర్గగుడి, శ్రీశైలం, సింహాచలం, ద్వారకా తిరుమల, పెనుగంచిప్రోలు లక్ష్మీతిరుపతమ్మ ఆలయం, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంతో పాటు మరికొన్ని క్షేత్రాలకు పేదలను తీసుకెళ్లడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
ఏటా ఒక్కో జిల్లా నుంచి పది వేల మందిని తీర్థయాత్రలకు తీసుకెళ్లాలని, దర్శనం, తీర్థ ప్రసాదాల బాధ్యత కూడా దేవాదాయశాఖే తీసుకోనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి భక్తులను ఎంపిక చేస్తామని, ఒక్కో కుటుంబం నుంచి గరిష్టంగా ఐదుగురిని తీసుకుళ్లే యోచనలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. అలాగే ఒక్కో మండలం నుంచి లాటరీ ద్వారా 200 మందిని “దివ్య దర్శనం” కోసం ఎంపిక చేయనున్నారు. 18 నుంచి 70 ఏళ్ల వయసున్న వారు ఇందుకు అర్హులు. త్వరలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…