
అంతవరకు ఎంతో ఉత్సాహంగా ఉన్న చంద్రబాబు నాయుడు సైతం ఊహించని ఈ ఘటనకి షాక్ అయ్యారు. రోడ్ షో నిలిపివేసి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. మృతుల కుటుంబాలకు టిడిపి తరపున రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. కానీ మరో 15 లక్షలు, టిడిపి నేతలు అందించే మరో రూ.3 లక్షలు కలిపి కలిపి ఒక్కొక్క కుటుంబానికి రూ. 28 లక్షలు చొప్పున అందిస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మృతుల కుటుంబాలలో పిల్లలకి చదువు చెప్పించే బాధ్యత ఎన్టీఆర్ ట్రస్ట్ తీసుకొంటుందని చంద్రబాబు నాయుడు నిన్నే ప్రకటించారు.
ఈ విషాద ఘటనపై సిఎం జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున నష్టపరిహారం కూడా ప్రకటించారు.
ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ కూడా స్పందించారు. మృతుల కుటుంబాలకి సానుభూతి తెలిపి ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
చంద్రబాబు నాయుడు పర్యటనలో ఇంత భారీ స్థాయిలో జనాలు వచ్చినప్పుడు ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని, తగిన బందోబస్తు చేయాల్సి ఉంది. కానీ వారూ ఎటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు కానీ ఇప్పుడు ఈ ఘటనపై కేసు నమోదు చేసి ‘నిందితుల’ను కనిపెట్టే పనిలో పడ్డారు.
ఏది ఏమైనప్పటికీ ఈ విషాద ఘటన, అన్ని రాజకీయ పార్టీలకి, ప్రభుత్వానికి, పోలీసులకి అందరికీ ఓ గుణపాఠం వంటిదని చెప్పవచ్చు. కనుక మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అందరూ తగిన ముందస్తు జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం.
The fifth T20I between India and West Indies was washed out due to rain at…
Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…