
ఇక, తెలుగుదేశం పార్టీ నేతల్లో చాలా మంది ఫోటోలు తీయించుకునేందుకు చెట్లను నాటుతూ, ఆపై వాటిని గురించి పట్టించుకోవడం లేదని తనకు తెలిసిందని, ఇకపై అలా జరిగితే చూస్తూ ఊరుకోబోనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరికలు జారీ చేసారు. నాటే ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్ చేయించనున్నానని, దాని ద్వారా ప్రతి ఆరు నెలలకూ చెట్ల చిత్రాలను తెప్పించి వాటిని పరిశీలిస్తుంటానని వెల్లడించారు. దీంతో తామంతా అప్రమత్తమవ్వాల్సిన తరుణం ఆసన్నమైందని నేతలు చర్చించుకోవడం విశేషం.
ఆంధ్రాలో నేడు విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఓ పక్క ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ జరుగుతోంది. ఎప్పటిలాగే కడప జిల్లాలో ప్రధానంగా..…
Whenever films like Baththa and Dorothy come up, some are quick to ask why Telugu…