
అంటే పోలీసులు ఎవరి మీద కేసు నమోదు చేయాలో మంత్రులు ముందే చెపుతున్నారన్న మాట! కనుక పోలీసులు అదేవిదంగానే నడుచుకోక తప్పదు. నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు ఈ కేసు గురించి చెప్పింది వింటే, మంత్రులు ఇస్తున్న ఈ సూచనలను వారు అమలుచేయడానికి సిద్దం అవుతున్నట్లు అర్దం అవుతుంది.
నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు ఈ కేసు గురించి మీడియాతో మాట్లాడుతూ, “కందుకూరు పట్టణంలో మేము అనుమతించిన దాని కంటే 46 మీటర్లు చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చేశారు. మేము అనుమతించిన చోటే చంద్రబాబు నాయుడు సభ నిర్వహించుకొని ఉంటే ఈ ప్రమాదం జరిగేదే కాదు. కానీ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఎదురుగా ఉన్న ఇరుకు రోడ్డులోకి ప్రవేశించాలని ప్రయత్నించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నాము.
ఈ ఘటనలో గాయపడిన పిచ్చయ్య అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. డీఎస్పీ ర్యాంక్ అధికారిని విచారణాధికారిగా నియమిస్తాము. ఘటనకి సంబందించి అన్ని సాంకేతిక, డిజిటల్ సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకొని ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాము,” అని చెప్పారు.
The fifth T20I between India and West Indies was washed out due to rain at…
Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…