
బీసీ కమిషన్ చైర్మన్ రిజర్వేషన్లకు అనుకూలంగా లేరని, కేవలం కాపులను ఆర్ధికంగా ఆదుకుంటే చాలని అభిప్రాయపడినట్టు తెలుస్తుంది. అటువంటి నివేదిక వస్తే రాజకీయంగా ఇబ్బంది అవుతుందని, అదే విధంగా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించి సభ్యులతో ఒక నివేదిక తెప్పించుకున్న చంద్రబాబు ప్రభుత్వం దానిని అసెంబ్లీలో పెట్టిన సంగతి తెలిసిందే.
అయితే మంజూనాధ్ అది నివేదికే కాదని,తాను ఇచ్చేది మాత్రమే నివేదిక అవుతుందని స్పష్టంగా చెప్పారు.తాను కార్యదర్శి ద్వారా నివేదికను పంపిస్తానని కూడా అన్నారు. ఆయన తన నివేదికను ఇవ్వడానికి సిద్దమవుతున్న తరుణంలో బిసి కమిషన్ సభ్య కార్యదర్శిని ప్రభుత్వం సెలవులో పంపించిందని వార్తలు వస్తున్నాయి.
కాపులకు ప్రభుత్వం 5% రిజర్వేషన్ల కోసం తీర్మానం చెయ్యగా, ముద్రగడ పద్మనాభం 10% కావాలని, పవన్ కళ్యాణ్ 15% కావాలని డిమాండ్ చేసారు. రిజర్వేషన్లు 50% దాటేయడంతో ఇప్పుడు కేంద్రం నిర్ణయం కీలకం కాబోతుంది. కేంద్రం దీనిని సెక్షన్ 9లో పెడితే కోర్టులు కలగజేసుకోకుండా అవుతుంది. దానితో కాపుల రిజర్వేషన్లకు అడ్డంకి లేకుండా అవుతుంది.
Is Sivakarthikeyan finally answering the old Sardar vs Prince fan war, four years later? His…
ప్రతీ రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు... వాటి కోసం ఓ శాఖ, మంత్రి, వాటి పర్యవేక్షణకు వందలాది మంది అధికారులు,…