Telugu

చంద్రబాబు జిల్లాల పర్యటన… బొత్స, ధర్మానలకి నిద్ర కరువే!

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నేటి నుంచి మూడు రోజులపాటు విజయనగరం జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12.15 గంటలకి విమానంలో విశాఖకి చేరుకొంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల, మీదుగా మధ్యాహ్నం 3.30 గంటలకి చిలకలపాలెం జంక్షన్ చేరుకొంటారు. దారిలో టిడిపి నేతలు, కార్యకర్తలతో భేటీ అవుతారు. మళ్ళీ అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో లోలుగులో జిల్లాలోని ఏడు నియోజకవర్గాల టిడిపి నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశమవుతారు. సాయంత్రం 4 గంటలకి పొగిరి గ్రామంలో రైతులతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యి వారి సమస్యలని అడిగి తెలుసుకొంటారు.

ADVERTISEMENT

అక్కడి నుంచి మళ్ళీ విజయనగరం జిల్లా రాజాం చేరుకొని పట్టణంలో “ఇదేం ఖర్మ రాష్ట్రానికి” పేరిట రోడ్ షోలో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తారు. తర్వాత స్థానిక సిబిఎం చర్చిలో జరిగే మినీ క్రిస్మస్ వేడుకలలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. శుక్రవారం బొబ్బిలి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పర్యటించి రోడ్ షో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఓబీసీ నేతలతో చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు.

చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం విజయనగరం జిల్లా రైతులతో భేటీ అవుతారు. తర్వాత పట్టణంలో రోడ్ షోలో పాల్గొంటారు. సాయంత్రం పట్టణంలో కోట జంక్షన్ వద్ద భారీ బహిరంగసభలో ప్రసంగిస్తారు.

చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పర్యటనని విజయవంతం చేసేందుకు రెండు జిల్లాల టిడిపి నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు జిల్లా పర్యటనలకి వచ్చినా ఆయా జిల్లాలో మంత్రులు, వైసీపీ నేతలు ఆయనని అడ్డుకొనేందుకు లేదా అల్లర్లు సృష్టించి ఇబ్బంది పెడుతుండటం పరిపాటిగా మారింది. కనుక ఆ కోణంలో నుంచి కూడా టిడిపి నేతలు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

చంద్రబాబు నాయుడు ఇదివరకు రెండు జిల్లాలలో పర్యటించినప్పుడు సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా జిల్లా మంత్రులపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఇప్పుడూ చంద్రబాబు నాయుడు విమర్శలు తప్పవు. ఇదివరకు చంద్రబాబు జిల్లా పర్యటనలకి భారీగా ప్రజలు తరలివచ్చారు. ఈసారి అంతకంటే ఎక్కువమందే రావచ్చు.

చంద్రబాబు నాయుడు రోడ్ షోలకి భారీగా జనాలు తరలివచ్చి ఆయన రోడ్ షోలు, సభలు విజయవంతమైతే దానిని జిల్లా మంత్రులు, స్థానిక వైసీపీ నేతల వైఫల్యంగా సిఎం జగన్మోహన్ రెడ్డి పరిగణించే ప్రమాదం ఉంటుంది కనుక రెండు జిల్లాల మంత్రులు, వైసీపీ నేతలకి చంద్రబాబు నాయుడు పర్యటనలతో నిద్రలేని రాత్రులు తప్పకపోవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

IND vs WI 5th T20: Rain Washes Out Decider, Trophy Shared

The fifth T20I between India and West Indies was washed out due to rain at…

3 hours ago

Why Ranabaali Raises Big Doubts on Prabhas’ Fauzi?

Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…

4 hours ago