
జగన్ దృష్టి కుప్పం నియోజకవర్గంపై పడినప్పటి నుంచి కుప్పంలో కూడా వైసీపీ అరాచకాలు మొదలైపోయాయని చంద్రబాబు నాయుడు అన్నారు. మొన్న నియోజకవర్గాల ఇన్ఛార్జ్లతో సమావేశమైనప్పుడు చంద్రబాబు నాయుడు కుప్పం పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడుతూ, “జగన్ క్యారెక్టర్ ఎటువంటిదో తెలుసుకొనేందుకు కుప్పంలో వైసీపీ చేస్తున్న అరాచకాలను చూస్తే అర్దం అవుతుంది. కనుక కుప్పంలో మన పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ విభేధాలు, బేషజాలు పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయాలి. కుప్పంలో టిడిపి కోసం పనిచేస్తున్నవారిపై వైసీపీ ప్రభుత్వం పోలీసులతో అక్రమకేసులు బనాయించి వేధిస్తోంది. వారికి, వారి కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అన్నివిదాలుగా అండగా ఉంటుంది. ఇప్పుడు వైసీపీ నేతలతో వారి కనుసన్నలలో పనిచేస్తున్న పోలీసులతో మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి నాకు తెలుసు. మళ్ళీ మనం అధికారంలోకి రాగానే వారందరి లెక్కలు నేను సరిచేస్తాను. అంతవరకు కుప్పంలో మీరందరూ వైసీపీ నేతల అరాచకాలను ధీటుగా ఎదుర్కోవలసిన అవసరం ఉంది.
మనం అధికారంలో ఉన్నప్పుడు కుప్పంని అభివృద్ధికి రోల్ మోడల్గా నిలపడానికి ప్రయత్నించామే తప్ప ఏనాడూ ఈవిదంగా దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడలేదు. అందుకే పులివెందులలో పార్టీలు, నేతలు మారుతున్నా కుప్పంలో మాత్రం టిడిపి అలాగే నిలిచి ఉంది. ఇప్పటికే వైసీపీ నేతలు కుప్పంలో కులం, మతం పేరుతో ప్రజల మద్య చిచ్చుపెడుతున్నారు. కనుక అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ కుప్పంని వైసీపీ బారి నుంచి కాపాడుకోవాలి. లేకుంటే ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో వైసీపీ నేతలు విశాఖలో ఎటువంటి అరాచక పరిస్థితులు సృష్టిస్తున్నారో రేపు కుప్పంలో కూడా అలాగే చేయడం ఖాయం. టిడిపి ఎల్లప్పుడూ మీ వెనకే ఉంటుందని మరిచిపోవద్దు,” అని చంద్రబాబు నాయుడు కుప్పంలోని పార్టీ నేతలు, కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.
Retired IPS officer AB Venkateswara Rao is set to contest the Vijayawada Municipal Corporation mayoral…
Nani and Vijay Deverakonda are moving away from the romantic entertainers and emotional dramas that…