
పార్టీ ఇప్పుడు ఉన్నట్టుగా నిస్తేజంలోనే ఉంటె తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలలో తుడుచుపెట్టుకుని పోవడం ఖాయం. సహజంగా ఇటువంటి ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. పైగా ఎన్నికలు జరిగిన వెంటనే, అది కూడా వైఎస్సార్ కాంగ్రెస్ కు ఇటువంటి భారీ విషయం తరువాత జరిగేవి కాబట్టి వారికి ఇంకా సానుకూలత ఉంటుంది. ఈ తరుణంలో చంద్రబాబు జరగబోయే ప్రమాదాన్ని ముందే గుర్తించి నష్టనివారణ చర్యలు చేపడుతున్నారు.
మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వీలైనంత తొందరలో ఈ ఎన్నికలు జరిపించాలని కోరుకుంటుంది. కార్యకర్తలు జోష్ లో ఉండగానే అత్యధిక సీట్లు కైవసం చేసుకుని టీడీపీని మరింత నిరాశానిస్పృహలలోకి నెట్టాలని చూస్తుంది. అందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇటీవలే జరిగిన ఎన్నికలలో టీడీపీ కేవలం 23 ఎమ్మెల్యే సీట్లు, మూడు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ చరిత్రలో ఇదే ఘోరమైన ఓటమి.
భోగాపురం విమానాశ్రయానికి ఎప్పుడో ప్రారంభోత్సవం జరిగింది కదా? మళ్ళీ కొత్తగా ఈ ప్రారంభోత్సవం ఏమిటి? అనే సందేహం కలుగవచ్చు. భోగాపురం…
The Andhra Pradesh MPTC and ZPTC election process has entered the next stage, with reports…